
ఒకప్పుడు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్లలో రవళి ఒకరు. ఇప్పుడంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే అనే పాటతో చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంటుంది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. అప్పట్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన ఆమె.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. అయితే అప్పట్లో ఓ వెలుగు వెలిగిన రవళి.. అనుహ్యంగా సినిమాలకు దూరం కావడంపై ఆమె తల్లి విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయదుర్గ తన కూతుర్ల సినీప్రయాణాల గురించి మాట్లాడుతూ.. తన కూతుర్లు రవళి, హరిత సినిమాలు చేయడం ఎందుకు ఆపేశారో వెల్లడించారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన విజయ దుర్గ, ఒంటరిగా ముగ్గురు పిల్లలను పెంచడంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. సమాజం నుండి ఎదురైన అపార్థాలను, విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే తన లక్ష్యంగా కష్టపడినట్లు ఆమె తెలిపారు. వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై రూపాయలే మనవని, మిగిలిన ముప్పై మనవి కాదని తన పిల్లలకు నేర్పినట్లు వెల్లడించారు. అందుకే రవళి ఒక సినిమాకు పదిహేను, ఇరవై లక్షలు తీసుకోకుండా, ఐదు లక్షల పారితోషికంతోనే సంతృప్తి పడిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
రవళి కెరీర్ ఆగిపోవడానికి గల కారణాలు వెల్లడించింది. విజయదుర్గ మాట్లాడుతూ.. తన కూతురు బరువు పెరిగిందని అప్పట్లో వచ్చిన వార్తలే రవళి కెరీర్ ఆగిపోవడానికి కారణమని అన్నారు. అలాగే కొత్త హీరోయిన్లు తెరంగేట్రం చేయడం కూడా మరో కారణమని అన్నారు. తన కూతురు బరువు పెరిగిందని.. బొద్దుగా మారిందని వచ్చిన వార్తలు తమను ఎంతో బాధించాయని, “లావు అయితే సినిమాలు చేయకూడదా?” అని ప్రశ్నించారు. 2004లో రవళి వివాహం నిమిత్తం చెన్నై నుండి హైదరాబాద్‌కు మారినట్లు ఆమె తెలిపారు. రవళి 2007లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారని, చిరంజీవి గారి స్టాలిన్ చిత్రం ఆమె చివరిదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..