
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు విచిత్రమైన కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. పెద్ద హీరో తనకన్నా చిన్న వయసున్న అమ్మాయితో సినిమా చేస్తాడు. అలాగే కొంతమంది హీరోయిన్స్ ఒకే హీరోకు లవర్ గా, అమ్మగానూ నటిస్తుంటారు. ఒక సినిమాలో హీరోతో కలిసి ఆడిపాడిన హీరోయిన్ మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగా, అక్కగా లేదా మరో పాత్రలో కనిపించవచ్చు. అలాగే ఒక హీరోకు లవర్‌గా, భార్యగా నటించిన హీరోయిన్.. మరో సినిమాలో మరో హీరోకు అక్కగానో, అమ్మగానో నటిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఓ హీరోకు కూతురిగా చేసింది.. కట్ చేస్తే అదే హీరో సరసన హీరోయిన్ గానూ చేసింది ఆమె ఎవరో కాదు..
ఆమె మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ అందాల భామ రాశి. తన అందంతో అభినయంతో ఎంతో మంది హీరోల సరసన నటించి మెప్పించింది రాశి. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా రాణించిన రాశి కెరీర్ పీక్ లో ఉండగానే సహాయక నటిగా మారారు. ఆతర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు దాంతో ఆమె కేరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు రాశి.
పలు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటున్నారు రాశి. ఈ క్రమంలోనే ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. తాను ఎంతో మంది హీరోలతో కలిసి పని చేశానని తెలిపారు. బాలయ్య బాబుతో చిన్నప్పుడు ‘బాల గోపాలుడు’ చేశాను. పెద్దయ్యాక క్రిష్ణబాబులో హీరోయిన్‌గా చేశాను. అలాగే రాజశేఖర్ తో కలిసి మమతల కోవెలలో కూతురుగా చేశాను. హీరోయిన్‌గా ‘నేటి గాంధీ’ చేశాను అని తెలిపారు రాశి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.