Kavitha Son Death: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం… ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి

Kavitha Son Death: సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కరోనా వైరస్ బాధితులే.. గత 18 నెలలుగా ఈ వైరస్ బారిన అనేక మంది తమ ఫ్యామిలీ సభ్యులను బంధువులను...

Kavitha Son Death:  సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం... ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి
Kavita

Updated on: Jun 17, 2021 | 7:06 AM

Kavitha Son Death: సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కరోనా వైరస్ బాధితులే.. గత 18 నెలలుగా ఈ వైరస్ బారిన అనేక మంది తమ ఫ్యామిలీ సభ్యులను బంధువులను స్నేహితులను కోల్పోతూనే ఉన్నారు. సినీ పరిశ్రమలో హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమలను ఈ కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. ఇక సెకండ్ వేవ్ మొదలయ్యాక ఇండస్ట్రీ అనేక మందిని కోల్పోయింది.

1990 లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. ఓ వైపు భార్య కరోనా తో ప్రాణాల కోసం పోరాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కవిత కుమారుడు సంజయ్‌ రూప్‌ ను కబళించింది. సంజయ్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

కవిత 11 ఏళ్ల వయసులో వెండి తెరపై అడుగు పెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా పరిచయం అయ్యింది. కవిత హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. సుమారు 350 సినిమాలు చేసింది కవిత. సినీ పరిశ్రమలో కవిత తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై చిత్రపరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: దాబాలో భోజనం చేస్తున్న ఓ వక్తి.. ఆకలితో వచ్చిన పక్షి .. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా