Chaavu Kaburu Challaga : చావు కబురు చల్లగా నుంచి సీనియర్ నటి ఆమని లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

|

Mar 14, 2021 | 1:52 AM

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్  స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన చిత్రం  'చావు క‌బురు చ‌ల్ల‌గా'.

Chaavu Kaburu Challaga : చావు కబురు చల్లగా నుంచి సీనియర్ నటి ఆమని లుక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
Aamani
Follow us on

Chaavu Kaburu Challaga : మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్  స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన చిత్రం  ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అదిరిపోయే కామెడీ సీన్స్.. అద్భుతమైన ఎమోషన్.. మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులు అద్దుకున్న ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.

ఇక ‘బ‌స్తి బాల‌రాజు’గా హీరో కార్తికేయ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కార్తికేయ  ఫ‌స్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్ట‌ర్ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా సీనియర్ నటి ఆమని లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 90ల్లో మావిచిగురు, శుభలగ్నం లాంటి హోమ్లీ కారెక్టర్స్‌తో అలరించిన ఆమని.. చావు కబురు చల్లగా సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చేతిలో మద్యం సీసా.. వంట చేస్తూ విడుదలైన ఈమె ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో సీనియర్ నటీనటులు అంతా చక్కగా నటించారని అన్నారు.అలాగే  చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ … అల్ట్రా స్టైలిష్ కారవాన్ .. చూస్తే మతిపోవాల్సిందే..

Ponnambalam : ఒకప్పుడు విలన్ గా భయపెట్టి ఇప్పుడు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు..