సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో పలువురు ప్రముఖ నటీనటులు కన్నుమూశారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు.
పి.గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్, సినీ నిర్మాత, హీరో బొమ్మిరెడ్డి రాఘవప్రసాద్(64) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలు సినిమాల్లో ఆయన సహాయ నటుడిగా నటించారు. కిరాతుకుడు (చిరంజీవి నటించింది. కాదు) సినిమాలో హీరోగా నటించి, తానే ఆ సినిమాను నిర్మించి విడుదల చేశారు. రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, బంగారు బుల్లోడు, దొంగల బండి, సౌర్య చక్ర, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇంకా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బొమ్మిరెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Shocking: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక మహిళ మృతి.. గ్రామం మొత్తం అందకారం.. అసలేం జరిగిందంటే?
Today Horoscope: ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను నుంచి బయటపడతారు.. చేపట్టే పనులలో అవాంతరాలు..!