SebastianPC524 : కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నయా మూవీ నుంచి మరో పాట..

|

Feb 25, 2022 | 8:52 PM

'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకు హీరోగా  పరిచయమైన యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు

SebastianPC524 : కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నయా మూవీ నుంచి మరో పాట..
Kiranabbavaram
Follow us on

SebastianPC524 : ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా  పరిచయమైన యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’తో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్‌ – ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. మార్చి 4న ‘సెబాస్టియన్‌ పిసి 524’తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. మార్చి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సినిమాలో ‘సెబా…’ సాంగ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “మా ‘సెబాస్టియన్‌ పిసి524’ కిరణ్ అబ్బవరం కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘హేలీ…’ పాటలు మంచి స్పందన లభించింది. ఇప్పుడీ ‘సెబా…’ పాట సైతం విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు” అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..