Bigg Boss: తర్వలో పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ ?.. జబర్థస్త్ కమెడియన్‌తో ప్రేమలో యాంకరమ్మ ?..
సాధారణంగా బుల్లితెర నటీమణులు తమ తోటి నటులను ప్రేమ పెళ్ళి చేసుకోవడం సహజంగా చూస్తుంటాం. ఇప్పటివరకు బుల్లితెరపై సందడి చేసిన పలువురు ఫేమస్ నటీనటులు
సాధారణంగా బుల్లితెర నటీమణులు తమ తోటి నటులను ప్రేమ పెళ్ళి చేసుకోవడం సహజంగా చూస్తుంటాం. ఇప్పటివరకు బుల్లితెరపై సందడి చేసిన పలువురు ఫేమస్ నటీనటులు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. నటీనటులు కాస్త చనువుగా కనిపిస్తే వెంటనే వాళ్లు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే ఆ రూమర్లపై కొందరు స్పందిస్తుంచగా.. మరికొందరు మాత్రం అవేమి పట్టించుకోరు. తాజాగా ఇప్పుడు బుల్లితెరపై ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి పాపులారిటీ సంపాదించుకుంది జోర్దార్ సుజాత. ఇదే పాపులరారిటీతో బిగ్‌బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ అనంతరం..పలు షోలలో పాల్గోంటుంది. రాకింగ్ రాకేష్ తో కలిసి పలు కామెడీ స్కిట్స్ చేస్తూ వస్తుంది. ఇటీవల వీరిద్దరూ వాలెంటైన్స్ డే సందర్భంగా.. ప్రపోజ్ చేసుకున్నారు. ఇందులో రాకేష్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా.. సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. అయితే స్కిట్ లో భాగంగా చేసినా.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై సుజాత, రాకేష్ స్పందించలేదు.
Also Read: Bheemla Nayak Review: సమ్మర్ సినిమాలకు శుభారంభం.. భీమ్లా నాయక్.. పర్‌ఫెక్ట్ మూవీ రివ్యూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. ఏమన్నారంటే..
Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా