Satyadev: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్..

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు టాలెంటెడ్ యాక్టర్.

Satyadev: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్..
Satyadev
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 11:56 AM

Satyadev: విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు టాలెంటెడ్ యాక్టర్. హీరోగా నటిస్తూనే పలు సినిమాల్లో కీలక పాత్రల్లోనూ కనిపించి ఆకట్టుకుంటోన్నాడు. ఇక తెలుగులోనే కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. గతంలో అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమాలో నటించాడు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న రామ్ సేతు సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తోన్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ విషయం పై సత్యదేవ్ స్పందిస్తూ.. అక్షయ్ సినిమాలో ఛాన్స్ రావడం పై ఆనందం వ్యక్తం చేశాడు.

కొన్ని సంఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి.  నా బాలీవుడ్ ఎంట్రీ కూడా అలాగే జరిగింది. అక్షయ్ కుమార్ సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. రామ్ సేతు సినిమాలో మంచి పాత్ర లభించింది అంటూ చెప్పుకొచ్చాడు సత్యదేవ్. ఇక తెలుగులో సత్యదేవ్ వరుసగా సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే తిమ్మరుసు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. వీటితోపాటు ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో నటిస్తున్నాడు సత్యదేవ్.

మరిన్ని ఇక్కడ చదవండి :

అదంటేనే భయమేస్తోంది.. ప్లీజ్ వాటినెవరూ టచ్ చేయోద్దంటోన్న గ్లోబల్ స్టార్!

Krithi Shetty : ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న అందాల కృతి .. ఆ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిందట..

Rakul Preet Singh: హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్… జిమ్ లో చెమట్లు చిందిస్తోన్న అందాల రకుల్.. వీడియో వైరల్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!