Gurthunda Sheethakalam: ఎట్టకేలకు  విడుదలకు సిద్ధమైన ఫీల్ గుడ్ లవ్‏స్టోరీ.. థియేటర్లలో సందడి చేయనున్న గుర్తుందా శీతాకాలం..

టాలెంటెడ్ హీరో సత్యదేవ్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేదాక్షర్ మూవీస్ బ్యానర్ పై భావన రవి

Gurthunda Sheethakalam: ఎట్టకేలకు  విడుదలకు సిద్ధమైన ఫీల్ గుడ్ లవ్‏స్టోరీ.. థియేటర్లలో సందడి చేయనున్న గుర్తుందా శీతాకాలం..
Gurthunda Sheethakalam

Updated on: May 13, 2022 | 7:49 AM

చిన్న సినిమాలైనా.. పెద్ద సినిమాలైనా.. కొన్ని సార్లు అనుకోని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతుంటాయి. షూటింగ్ పూర్తై.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసినప్పటికీ రిలీజ్ విషయంలో మాత్రం జాప్యం జరుగుతుంటుంది. ఇటీవల కరోనా కారణంగా ఎన్నో చిత్రాలు ఆలస్యంగా విడుదలైన సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై విశేష స్పందన అందుకుని.. ప్రేక్షకుల ముందుకు రాని చిత్రాలు ఎక్కువగానే ఉన్నాయి. అందులో గుర్తుందా శీతాకాలం సినిమా ఒకటి.. టాలెంటెడ్ హీరో సత్యదేవ్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేదాక్షర్ మూవీస్ బ్యానర్ పై భావన రవి, రామారావు చింతపల్లి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించగా.. డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది..

అనుకోని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసినట్లు పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో తమన్నా.. సత్యదేవ్ రొమాంటిక్ లుక్కులో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కన్నడలో విజయవంతమైన లవ్ మాక్ టైల్ చిత్రాన్ని తెలుగు రీమేక్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందమైన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్, కావ్య శెట్టి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాలబైరవ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..