Telugu Hit Songs: సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ వెలుగులోకి వచ్చారు. ఈ కార్యక్రమంను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ ప్రోగ్రాంలో ఎవరు విన్ అవుతారా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పాడి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ పోగ్రాంలో యశస్వి కొండేపూడి విన్నర్‌గా నిలిచాడు. అలాగే భరత్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ యంగ్ సింగర్స్ అందరూ కలిసి ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. 1970 నుంచి 2020 వరకు 50 ఏళ్లలో తెలుగు హిట్ సాంగ్స్‌ను తమ గాత్రంలో అద్భుతంగా పలికించారు. కొత్త పాతల కలయికలతో అదరగొట్టారు. గాత్ర ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది వీరి ప్రయత్నం.
హిట్ సాంగ్స్‌ను అందంగా తమ గొంతుతో మరోసారి పాడి ఆకట్టుకున్నారు. యశస్వీ కొండేపూడి, ప్రజ్ఞ నయని, అనన్య భాస్కర్, లక్ష్మి గాయత్రి, యుతి, గణేష్, వెంకట చైతన్య, సాయి సమీర, విక్రమ్, ప్రతిమ, జగదీశ్ , రాజేశ్వరి, స్వప్నిక, తేజ ఇలా అందరు మరోసారి తమ మధురమైన గాత్రంతో పాట పాటలను ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను కూడా మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :