K.Viswanath: కళాతపస్విని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న అలనాటి హీరోయిన్.. ఇప్పుడు ఆయన్ని చూడలేనంటూ భావోద్వేగం..

|

Feb 11, 2023 | 6:21 PM

ఆయన తెరకెక్కించిన ఒక్కో సినిమా ఒక్కో స్వాతిముత్యం. శంకరాభరణం, ఆపద్భాంధవుడు, సాగర సంగమం, స్వయం కృషి, సిరివెన్నెల వంటి చిత్రాలను తెరకెక్కించారు.

K.Viswanath: కళాతపస్విని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న అలనాటి హీరోయిన్.. ఇప్పుడు ఆయన్ని చూడలేనంటూ భావోద్వేగం..
Saptapadi Sabitha
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహాశకం కనుమరుగైంది. కొద్ది రోజులుగా వరుసగా అలనాటి నటీనటులు.. దర్శకులు.. గాయనీగాయకులు చిత్రపరిశ్రమకు దూరమయ్యారు. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు, జమున, సింగర్ వాణీ జయరామ్, లెజండరీ డైరెక్టర్ కె. విశ్వనాధ్ మరణాలతో తెలుగు చిత్రపరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. ఇక డైరెక్టర్ విశ్వనాధ్ మృతితో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయనతో కలిసి నటించినవారు.. విశ్వనాధ్ దర్శకత్వంలో పనిచేసిన నటీనటులు ఆయన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎన్నో అద్భుతమైన కళాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించారు విశ్వనాధ్. ఆయన తెరకెక్కించిన ఒక్కో సినిమా ఒక్కో స్వాతిముత్యం. శంకరాభరణం, ఆపద్భాంధవుడు, సాగర సంగమం, స్వయం కృషి, సిరివెన్నెల వంటి చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాధ్ తెరకెక్కించిన చిత్రాల్లో సప్తపది కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

1981లో విడుదలైన ఈ సినిమా భారతీయ నృత్యం ప్రధానంశంగా తెరకెక్కించారు. ఇందులో జె.వి. సోమయాజులు.. భమిడిపాటి సబిత, గిరీష్, అల్లు రామలింగయ్య ప్రధానపాత్రలలో నటించారు. ఈ సినిమాలో కథానాయికగా కనిపించిన సబిత.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. దర్శకులు విశ్వనాధ్‏ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.” నేను ఆ మధ్య కెనడా వెళుతూ ఆయనను కలిసే వెళ్లాను. తిరిగి వచ్చాక కూడా కలిశాను. ఇంతకాలం ఎక్కడికి వెళ్లావు ? అని ఆయన అడిగారు. మీకు చెప్పే వెళ్లాను కదా గురువుగారు అంటే.. తనకు గుర్తులేదని అన్నారు. శంకరాభరణం సినిమా ప్రివ్యూలో మొదటిసారిగా విశ్వనాధ్ గారిని చూశాను. ఆ తర్వాత సినిమాకు ఫోటోస్ పంపించమంటే పంపించాము.

ఇవి కూడా చదవండి

శుభోదయం సినిమా కోసం ఆయన అనుకుని ఉంటారు. కానీ నేను డాన్స్ ప్రధానమైన సినిమానే చేస్తానని చెప్పడంతో సప్తపది చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా చేసేందుకు చాలా భయపడిపోయాను. కానీ విశ్వనాధ్ గారు ధైర్యం చెప్పి చేయించారు. సంగీతం.. సాహిత్యం.. గానం.. నాట్యనం వీటన్నింటి గొప్ప కలయికతో కూడిన సినిమా చేయడం నా అదృష్టం. ఆయనను చూసేందుకు ఎప్పుడైనా వెళితే మరోసారి ఈ సినిమాలోని డాన్స్ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు ఆయనను చూడలేను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సబిత.