Santosh Sobhan : వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్స్..

|

Jun 12, 2021 | 5:01 PM

పల్లెల్లో మట్టివాసన ఎప్పుడైనా.. తాజాగా ఉంటుంది. అది మన మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది. అలాగే అక్కడ పుట్టే కథలు కూడా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.

Santosh Sobhan : వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్స్..
Follow us on

Santosh Sobhan :

ఏక్ మినీ కథ” ఇచ్చిన కిక్కుతో జోరు మీదున్న హీరో సంతోష్ శోభన్‌ మరో క్రేజీ డైరెక్టర్‌తో చేతులు కలిపారు. ఈ సారి సినిమా కాకుండా అంతకు మించి మనల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఏకంగా ఓ వెబ్‌ సిరీస్‌నే ప్లాన్‌ చేసి.. మనల్ని తన కాలనీలోకి, ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. ఓ డిఫరెంట్‌ పాయింట్తో మారుతి స్టైల్‌ ఆఫ్ డైలాగ్స్‌ అండ్‌ మేకింగ్తో ఈ సిరీస్‌ రూపొందనుంది. అయితే ఇప్పటికే స్టోరీ విన్న హీరో సంతోష్ శోభన్‌ సీరిస్‌ ఓకే చెప్పగా.. డైరెక్టర్ మారుతీ ప్రీ ప్రొడక్షన్ పునుల్లో పడ్డడారట. ఇక త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని ఆగస్ట్ ఫస్ట్‌ వీక్లో ఈ సిరీస్‌ను సెట్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారట డైరెక్టర్‌ మారుతీ. అందులో భాగంగా తన కాస్ట్ అండ్ క్రూని సిద్దం కూడా చేస్తున్నారట. ఇక లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా మెహ్రీన్‌ కౌర్‌ను తీసుకున్నారట డైరెక్టర్‌ మారుతి. రీసెంట్‌గా ఈ బ్యూటీకి స్టోరీ నరేట్‌ చేసి.. డేట్స్‌ కూడా లాక్‌ చేశారట. ఇక స్టోరీ విన్న మెహ్రీన్‌ చాలా ఎగ్జైటెడ్గా ఈ సిరీస్‌ కోసం వెయిట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

డైరెక్టర్ మారుతీ ఈ సిరీస్‌ టైటిల్ను ఇంకా అనౌన్స్‌ చేయనప్పటికీ “కాలినీలో ప్రేమాయణం”, “మంచి రోజులు వచ్చాయి” అనే రెండు టైటిల్లు మాత్రం అటు ఇండస్ట్రీలోను ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam: ఓ వైపు తాను మరణించినట్లు కలగన్న మోనిత.. మరోవైపు దీప పిల్లలు తప్ప ఇంకెవరూ వద్దంటున్న కార్తీక్

SonuSood IAS: మ‌రో గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సోసూసూద్‌.. ‘సంభ‌వం’ పేరుతో ఉచితంగా ఐఏఎస్ కోచింగ్‌..