Manchi Rojulochaie: మంచి రోజు చూసుకొని వస్తున్న మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ సినిమా.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు దర్శకుడు మారుతి. మారుతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నారు.

Manchi Rojulochaie: మంచి రోజు చూసుకొని వస్తున్న మారుతి మంచి రోజులొచ్చాయి సినిమా.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..
Santhosh

Updated on: Oct 05, 2021 | 9:07 AM

Manchi Rojulochaie: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు దర్శకుడు మారుతి. మారుతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా. ఎక్కేసిందే పాటలకు  అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శోభన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంతోష్.. నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.. ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్.
ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఆయన  నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది.  సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి : 

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు

Shraddha Srinath: టాలెంటెడ్ హీరోయిన్ స్టైలిష్ ఫొటోస్.. ‘శ్రద్ధా శ్రీనాథ్‌’ వయ్యారాలపై ఓ లుక్కేయండి..

NagaChaitanya-Samantha: నెటిజన్ల పై సీనియర్ హీరోయిన్ సీరియస్.. మీ ఇష్టమొచ్చినట్టు ఉహించుకోకండి అంటూ