Allu Arjun: ‘శ్రీతేజ్ కళ్లు తెరుస్తున్నాడు.. బన్నీపై కేసు విత్ డ్రా చేసుకునేందుకు రెడీ’: రేవతి భర్త భాస్కర్

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Allu Arjun: 'శ్రీతేజ్ కళ్లు తెరుస్తున్నాడు.. బన్నీపై కేసు విత్ డ్రా చేసుకునేందుకు రెడీ': రేవతి భర్త భాస్కర్
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2024 | 4:06 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీ తేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజురోజుకు ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోందని తెలుస్తోంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. తాజాగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తూ మూస్తున్నాడు. కానీ మమ్మల్ని గుర్తు పట్టే స్థితిలో లేడు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అల్లు అర్జున్ టీమ్ నా బిడ్డ చికిత్స కోసం ఆర్థిక సాయం అందజేస్తోంది. అలాగే వారు వైద్యులతో నిత్యం మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు రేవతి భర్త భాస్కర్.

కాగా సంధ్య థియేటరల్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ఏ11 ముద్దాయిగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే జైలు కు వెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చాడు బన్నీ. మంగళవారం (డిసెంబర్ 24) మళ్లీ హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీసులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ పై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా గతంలోనూ ఇదే విషయం చెప్పారు భాస్కర్. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ కేసును ఉపసంహరించుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన భార్య, కుమారుడు అల్లు అర్జున్ అభిమానులని, అందరితో పాటే తామూ సినిమాకు వెళ్లామన్నాడు. రేవతి మృతికి, అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆరోజు అల్లు అర్జున్ తో పాటు చాలామంది థియేటర్ కు వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు.

రేవతి భర్తతో మాట్లాడుతోన్న మంత్రి కోమటి రెడ్డి, పుష్ప 2 నిర్మాతలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ