
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో స్పిరిట్ కూడా ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండడంతో అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాలో తృప్తి దిమ్రీ హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే స్పిరిట్ ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరలవుతోంది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు ప్రభాస్ తండ్రిగా ఓ పవర్ ఫుల్ రోల్ లో చిరంజీవి కనిపించనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అక్కినేని నాగార్జున శివ రీ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా- నాగార్జున- సందీప్ రెడ్డి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో స్పిరిట్ సినిమాలో చిరంజీవి ఉన్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి.
‘మెగాస్టార్ చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో లేరు. అది జస్ట్ ఒక రూమర్ మాత్రమే. కానీ ఆయనతో నేను ఒక సోలో సినిమా చేస్తాను. దాని కోసం కథ తయారు చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. తద్వారా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ ఉన్నారనేది రూమరేనని కుండబద్దలు కొట్టేశాడు సందీప్ రెడ్డి. అదే సమయంలో చిరంజీవితో ఒక సోలో సినిమా చేస్తానని సందీప్ చెప్పడంతో మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
“I want to do a solo film with #Chiranjeevi garu.”
– #SandeepReddyVanga pic.twitter.com/lhvI8VKinM
— SouthMovie (@MovieSouth007) November 12, 2025
కాగా మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే వారిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కూడా. అంతేకాదు తన ఇంట్లో చిరంజీవి నటించిన ఆరాధన సినిమా పోస్టర్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసి అలంకరించుకున్నాడు.
Happy birthday CHIRANJEEVI sir 🤗#ChiranjeeviBirthday #Chiranjeevi @KChiruTweets pic.twitter.com/pN9sT0ABOC
— Sandeep Reddy Vanga (@imvangasandeep) August 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.