యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ.. డార్లింగ్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్..
డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి సంచారి సాంగ్ టీజర్ రేపు మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ క్రమంలో సంచారి పాటకు సంబంధించిన ప్రభాస్ న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే చిత్రాన్ని ప్రారంభించారు డార్లింగ్.
Get set to take flight with the next song from the #MusicalOfAges #RadheShyam. #UddJaaParindey #Sanchari #Raegaigal #SwapnaDoorame. Teaser out tomorrow at 1 PM!
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/9pb3joCytE— UV Creations (@UV_Creations) December 13, 2021
Also Read: Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..
Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..
Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..