పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించగా.. రానా దగ్గుబాటి,, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) కీలకపాత్రలలో నటించారు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో డానియల్ శేఖర్ అకా రానా దగ్గుబాటికి జోడీగా నటించి మెప్పించింది. అయితే తాజాగా సంయుక్త మీనన్.. ఆమె సినిమా స్క్రీన్ టైమ్ విషయంలో సంయుక్త నిరాశకు గురైందని వార్తలు వచ్చాయి..
ఈ సినిమా కోసం సంయుక్త దాదాపు 20 రోజులు సమయం కేటాయించిందని.. కానీ సినిమా షార్ప్ రన్ టైమ్ కారణంగా ఆమెకు చిత్రంలో పెద్దగా స్కోప్ రాలేదంటూ రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది సంయుక్త. తాను మనస్తాపం చెందిన మాట నిజమేనంటూ ఓ సెటైరికల్ పోస్ట్ చేసింది. .. అభిమానులతో కలిసి రెండవసారి సినిమా చూసేందుకు ట్రై చేస్తే.. టికెట్స్ దొరకనప్పుడు భీమ్లా నాయక్ తో నేను నిరాశ చెందాను.. అంటూ పోస్ట్ చేసింది సంయుక్త. ఇదిలా ఉంటే.. తెలుగులో ఈ మలయాళ బ్యూటీకి ఆఫర్లు ఎక్కువగానే వచ్చేట్టు కనిపిస్తున్నాయి.