గత కొద్ది రోజులుగా సమంత (Samantha) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఫోటోషూట్స్.. విదేశాల్లో ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేసేస్తుంటుంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక ఇటీవల సామ్ చేసిన ఫోటోషూట్స్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది సామ్. విడాకులు ప్రకటించిన తర్వాత సమంత ఎక్కువగా తన ఇన్‌స్టాలో మోటివేషనల్ కోట్స్.. మై మామ్స్ సెడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కోట్స్ షేర్ చేసింది. అప్పట్లో సామ్ షేర్ చేమే పోస్ట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి తన ఇన్‌స్టాలో మై మామ్స్ సెడ్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.
“కొన్నిసార్లు మన మనసులోని బలం అందరికీ కనిపించేంత పెద్ద ఫైర్ కాదు.. కొన్నిసార్లు అది ఒక చిన్న స్పార్క్. ఇది ఎప్పుడూ చాలా మృదువుగా ఉంటుంది.. ఇది ఎప్పుడూ మృదువుగా ఉంటుంది.. ” అంటూ పోస్ట్ చేసింది. విడాకుల అనంతరం సామ్ తన సోషల్ మీడియా ఖాతాలలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డెలిట్ చేసింది. ఇక ఇటీవల ఏకంగా నాగచైతన్యను అన్‌ఫాలో చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా సామ్ తన మల్టీటాలెంట్‌ను బయటపెట్టింది. తన పర్సనల్ స్టైలీస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌కు హెయిర్ కట్ చేసిన వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట చేసింది. నేను మల్టీటాలెంట్‌ను… నేను చేసిన పనికి నువ్ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ప్రీతమ్ కూడా చంపెయ్ అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?
OTT Platforms: ఓటీటీ వేదికపై సందడి చేయనున్న పెద్ద సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ డేట్స్ ఏంటంటే..
Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్ ట్రీట్.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..
RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్