Samantha- Raj Nidimoru: పెళ్లిపై సమంత అధికారిక ప్రకటన.. ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ సమంత పెళ్లి వార్తలు ఉదయం నుంచి వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగినట్లు సమంత అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ తమ పెళ్లి వార్తలను కన్ఫార్మ్ చేశారు. సామ్, రాజ్ పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి.

Samantha- Raj Nidimoru: పెళ్లిపై సమంత అధికారిక ప్రకటన.. ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్..
Samantha

Updated on: Dec 01, 2025 | 2:04 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. సోమవారం (డిసెంబర్ 1)న వీరిద్దరు కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల సాక్షిగా ఒక్కటయ్యారు. తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు సామ్. రాజ్ తో తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందులో సామ్ ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ముస్తాబుకాగా..క్రీమ్ , గోల్డెన్ కలర్ షర్వానీ ధరించారు రాజ్. ఆ ఫోటోలలో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని.. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. సమంత, రాజ్ పెళ్లి అటు ఈషా ఫౌండేషన్ సైతం అధికారికంగా రియాక్ట్ అయ్యింది.

ఏమాయ చేసావె’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగచైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ, క్రైస్టవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు 2021లో ప్రకటించింది ఈ జంట. టాలీవుడ్‌ అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్త. ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి.

విడాకుల తర్వాత సమంత కెరీర్‌ మీద ఫోకస్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజ్‌ – సామ్‌ రిలేషన్‌ షిప్‌ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్‌ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్‌ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది. ఆ తర్వాత సమంత ట్రాలాలా పిక్చర్స్ ని ప్రారంభించి శుభం మూవీ చేశారు. ఈ సినిమాకు రాజ్‌ నిడిమోరు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. చెన్నై పికిల్‌ బాల్‌ టీమ్‌కి వీరిద్దరూ కో ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు. పికిల్‌ బాల్‌ ఈవెంట్లకు సామ్‌ వెళ్లినప్పుడు, ఆమె చెయ్యి పట్టుకుని రాజ్‌ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్‌ అయింది.

ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

Follow Us