
మాస్ మహారాజా రవితేజకు బ్యాడ్ లక్ వెంటాడుతుంది. వరుస గా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కొత్త కొత్త దర్శకులతో పని చేస్తున్నా కూడా ఒక్కటీ వర్కౌట్ కావడం లేదు.. అలాగే స్టార్ దర్శకులు కూడా రవితేజకు హిట్ ఇవ్వలేకపోయారు. మొన్నామధ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. నిన్నటికి నిన్న మాసుజాతర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా పడితే రవితేజ తిరిగి ఫామ్ లోకి వస్తారని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
భర్తమహాశయులకు విజ్ఞప్తి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాస్ రాజా మరో సినిమాను లైనప్ చేశాడని తెలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌ను సెలక్ట్ చేశారని తెలుస్తుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత రెండు సినిమాలు చేసింది. ఒకటి నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా. ఇక ఇప్పుడు మరోసారి శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటిస్తుందని అంటున్నారు. ఈసారి రవితేజకు జోడీగా సామ్ నటిస్తుంది. మొదటిసారి సమంత రవితేజ కలిసి నటిస్తున్నారు. మరి సమంత అయినా రవితేజకు హిట్ ఇస్తుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.