AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత తన భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? రాజ్ నిక్‌నేమ్ భలే ఉందిగా..

అటు పర్సనల్ లైఫ్ పరంగానూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఇప్పుడు సమంత ఫుల్ జోష్ లో ఉంది. ఆమె నటించిన మా ఇంటి బంగారం సూపర్ హిట్ అయ్యింది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ తాను తల్లిని కాబోతున్నట్లు మరో గుడ్ న్యూస్ చెప్పింది సామ్.

Samantha: సమంత తన భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? రాజ్ నిక్‌నేమ్ భలే ఉందిగా..
Samantha, Raj Nidimoru
Basha Shek
|

Updated on: Jun 25, 2026 | 11:16 AM

Share

చాలా రోజుల తర్వాత సమంత ముఖంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తోంది. విడాకులు, మయోసైటిస్, సోషల్ మీడియా ట్రోల్స్.. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న సామ్ ఇప్పుడు మళ్లీ హ్యాపీగా కనిపిస్తోంది. అటు పర్సనల్ లైఫ్ పరంగానూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఫుల్ జోష్ లో ఉంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత సామ్‌ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జూన్ 19న విడుదలైన మా ఇంటి బంగారం సినిమా ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ ఆనందం మరింత రెట్టింపు అయ్యేలా మరో గుడ్ న్యూస్ చెప్పిందీ అందాల తార. తాను త్వరలో తల్లినా కానున్నానంటూ, ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్‌ అన్న శుభవార్తను అధికారికంగా వెల్లడించింది సామ్. బుధవారం (జూన్ 24) హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో సమంత స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. కాగా ఇదే ఈవెంట్‌లో తన భర్త రాజ్ నిడిమోరు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సామ్.

మా ఇంటి బంగారం సినిమాలో సమంత తన భర్త అనిరుధ్‌ని ముద్దుగా హనీ అని పిలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజ నీజ జీవితంలో భర్త అయిన రాజ్‌ని ప్రేమగా ఏమని పిలుస్తారు అని సక్సెస్‌ మీట్‌లో సమంతను అడిగింది యాంకర్‌. దీనికి సిగ్గుతో మురిసిపోయిన సమంత ఇలా సమాధానం చెప్పుకొచ్చింది. ‘రాజ్‌ని ఇంట్లో వాళ్ల అమ్మ, చెల్లి ప్రేమగా బాబు అని పిలుస్తారు. నేను కూడా అలానే పిలుస్తాను’ అని నవ్వుతూ చెప్పింది సామ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సమంత, రాజ్ నిడిమోరులది ప్రేమ వివాహం. ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్ సిరీస్‌ చేస్తున్న సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక గతేడాది వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక మా ఇంటి బంగారం సినిమాలోనూ రాజ్ నిడమోరు భాగస్వామిగా ఉన్నారు.

మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో సమంత, రాజ్ నిడిమోరు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us