
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొమురం భీమ్ గా అలరించడానికి రెడీ అవుతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. జనతా గ్యారేజ్ సినిమాలో యాక్షన్ తోపాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.
ఇక ముందుగా త్రివిక్రమ్ తో తారక్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కొరటాల శివ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని అనుకున్నారు. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. ఇక ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ సినిమాల పై ద్రుష్టి పెట్టనుంది. రామ్ చరణ్ శంకర్ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుంది. అయితే కొరటాల తారక్ సినిమాలో కూడా కియారా ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కియారా ప్లేస్‌లో సమంతను ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ్ సినిమాలతోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు కొరటాల తారక్ సినిమాలోనూ సమంత ఫిక్స్ అని అంటున్నారు. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలోనూ సమంత హీరోయిన్‌గా నటించింది. ఓ వైపు స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రలకు ఓకే చెబుతూనే.. మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కమిట్ అవుతోంది సమంత.
మరిన్ని ఇక్కడ చదవండి :