Ajith’s Valimai: సంక్రాంతి బరిలోకి కాలు దువ్వుతున్న స్టార్ హీరో అజిత్.. వలిమై రిలీజ్ ఎప్పుడంటే..

తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.

Ajith's Valimai: సంక్రాంతి బరిలోకి కాలు దువ్వుతున్న స్టార్ హీరో అజిత్.. వలిమై రిలీజ్ ఎప్పుడంటే..
Ajith
Follow us

|

Updated on: Dec 25, 2021 | 4:22 PM

Valimai: తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అజిత్. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అజిత్. ఈ క్రమంలో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై.. అజిత్ సినిమాలు ప్రతి సంక్రాంతి‌కి వచ్చి సందడి చేస్తుంటాయి. అలాగే ఇప్పుడు కూడా అజిత్ సంక్రాంతికి టార్గెట్ చేసి వస్తున్నాడు. వలిమై సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 13న వలిమై సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

ఈ సినిమాలో అజిత్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తమిళ్ తో పాటు..తెలుగు..హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని యూనిట్ డైసైడ్ అయింది చిత్రయూనిట్. ఈసినిమాను భారీగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను కోలీవుడ్ నిర్మాణ సంస్థ బే వ్యూ ప్రాజెక్ట్స్.. జీ స్టూడియోస్ ఇక్కడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. వలిమైలో  బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ నటించింది. ఈ చిత్రానికి `ఖాకీ` దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..