RRR Movie: జక్కన్న మళ్లీ జలక్‌ ఇవ్వనున్నాడా..? ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుకోని అడ్డంకి.. వాయిదా అనివార్యమా..

RRR Movie: యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలిలాంటి వండర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ...

RRR Movie: జక్కన్న మళ్లీ జలక్‌ ఇవ్వనున్నాడా..? ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుకోని అడ్డంకి.. వాయిదా అనివార్యమా..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 25, 2021 | 3:22 PM

RRR Movie: యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలిలాంటి వండర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి అగ్ర హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌ కూడా మొదలై రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇక చిత్ర యూనిట్‌ కూడా బాలీవుడ్‌లో చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇటీవల ముంబయిలో గ్రాండ్‌గా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి కరోనా అడ్డంకిగా మారనుందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూను సైతం విధించాయి. ఇక జనవరి 7కు ఇంకా పది రోజులకుపైగా సమయం ఉండడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇంకా కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్‌.ఆర్‌.ఆర్‌ వాయిదాకే చిత్ర యూనిట్ మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. మరి ఈ సినిమా నిజంగానే వాయిదా పడుతుందా.? లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Beauty tips : ఆవిరిని తీసుకునేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటో తెలుసుకోండి..!

Nostradamus Predictions For 2022 : 2022లో ముంచుకొస్తున్న మరో ప్రమాదం.. లైవ్ వీడియో

Gadget Guru: మీ పిల్లల చేత ఈ గేమ్స్ ఆడిస్తే బ్రెయిన్ చాలా షార్ప్.. వీడియో

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!