AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : ఫ్యాన్స్ గుడి కట్టడం పై సమంత రియాక్షన్.. ఎంకరేజ్ చేయను అంటూ..

సమంత రూత్ ప్రభు 2010లో విన్నైతాండి వరువాయా చిత్రంలో అతిధి పాత్రతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తర్వాత “ఏ మాయ చేశావే” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఈ సినిమా విజయం తర్వాత సమంత కెరీర్ లో వెనుదిగిరి చూసుకోలేదు, తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాల్లో నటించింది.

Samantha : ఫ్యాన్స్ గుడి కట్టడం పై సమంత రియాక్షన్.. ఎంకరేజ్ చేయను అంటూ..
Samantha Pic
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2025 | 8:32 AM

తన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది సమంత. ఓవైపు వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఆమె మరోవైపు కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. కాగా న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు సమంత ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందిన ఒక సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మే 9న శుభం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవల సమంత అభిమాను ఒకరు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సామ్ కు గుడి కట్టిన విషయం తెలిసిందే. తాజాగా సామ్ దీని పై స్పందించింది.

రీసెంట్ గా శుభం సినిమా ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని చేస్తున్నాను. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం. షూట్ స్టార్ట్ అయ్యాక మళ్లీ అప్డేట్లు వస్తుంటాయి. అట్లీ గారితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. భవిష్యత్తులో మేం ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి. ‘శుభం’ చిత్రానికి వసంత్ కథను అందించారు. ఈ మూవీ చూసిన తరువాత ప్రతీ ఒక్క ఆడియెన్స్ మీద ప్రభావం చూపించాలని కోరుకున్నాను. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఇది జనరల్ హారర్, కామెడీ అనేలా మాత్రం ఉండదు. సోషల్ సెటైర్ ఉంటుంది కానీ.. మెసెజ్ ఉంటుందా? లేదా? అన్నది మీరే (ఆడియెన్స్) తెలుసుకోండి.

నాకు నేనే ఓ పెద్ద విమర్శకులురాలిని. ఏ సినిమాలో ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకూడదని ఎడిటింగ్ టేబుల్ వద్ద చాలా కష్టపడ్డాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా సినిమాను కట్ చేశాం. నేను ఎప్పుడైనా కూడా నా మనసుకు నచ్చిందే చేశాను. నేను ఓ స్మార్ట్ ప్రొడ్యూసర్‌ని కాకపోవచ్చు.. నాకు బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ ఈ సినిమాను నా మనసుకు నచ్చింది కాబట్టి చేశాను. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను. ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను. ‘శుభం’ చిత్రానికి మంచి డేట్ దొరికింది. మే 9 అనేది సమ్మర్ హాలీడేస్‌లో ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుంటుంది. మంచి డేట్ దొరకడం మా అదృష్టం. క్లింటన్ సెరెజో సంగీతం బాగుంటుంది. పాత కాలానికి తీసుకు వెళ్లేలా పాటలు ఉంటాయి. వివేక్ సాగర్ బీజీఎం అందరినీ ఆకట్టుకుంటుంది. మే 9న రిలీజ్ అవుతున్న మా ‘శుభం’ సినిమాని అందరూ చూసి సక్సెస్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పూరీలు నూనె పీల్చకుండా ఉండాలంటే... సింపుల్ చిట్కాలు
పూరీలు నూనె పీల్చకుండా ఉండాలంటే... సింపుల్ చిట్కాలు
JoSAA 2025 వెబ్‌సైట్ వచ్చేసింది.. మరో 10 రోజుల్లోనే కౌన్సెలింగ్..
JoSAA 2025 వెబ్‌సైట్ వచ్చేసింది.. మరో 10 రోజుల్లోనే కౌన్సెలింగ్..
అయ్యో భగవంతుడా.. పిల్లల ఉసురు తీస్తున్న చిన్న చిన్న సరదాలు..
అయ్యో భగవంతుడా.. పిల్లల ఉసురు తీస్తున్న చిన్న చిన్న సరదాలు..
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
మర్డర్ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. పీకల్లోతు చిక్కుల్లో నటి!
మర్డర్ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్.. పీకల్లోతు చిక్కుల్లో నటి!
రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి
పెళ్ళైన 15 రోజులకే కనిపించకుండాపోయిన భర్త.. పాపం సినిమాలు మానేసి
అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు..
అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు..
ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
ఈపీఎఫ్‌వోలో ఈ ఐదు కీలక మార్పుల గురించి మీకు తెలుసా..?
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో