Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..

|

Nov 09, 2021 | 10:14 AM

విడాకుల ప్రకటన అనంతరం సమంత పూర్తిగా మారిపోయింది. గత కొద్ది నిశ్శబ్దంగా ఉండిపోయిన సామ్.. ఆ తర్వాత... కెరీర్ పై దృష్టి సారించారు.

Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..
Samantha
Follow us on

విడాకుల ప్రకటన అనంతరం సమంత పూర్తిగా మారిపోయింది. గత కొద్ది నిశ్శబ్దంగా ఉండిపోయిన సామ్.. ఆ తర్వాత… కెరీర్ పై దృష్టి సారించారు. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా గడిపేయాలని భావిస్తుంది. అంతేకాదు.. రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్లుగా టాక్. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. స్నేహితులతో కలిసి విదేశాలకు చక్కర్లు కొడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. తాజాగా సామ్ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.

ఈ నెల గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమానికి స్పీకర్‏గా వ్యవహరించే అవకాశం అందుకుంది సమంత. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్‏గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. ఇక సమంతతోపాటు.. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్, డైరెక్టర్ అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక సమంత.. తాప్సీ పన్ను సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై హిందీ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Puneeth Rajkumar: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని..

Tip Tip Barsa Pani: ఆ రాగం ఏది.. ఆ శృతి ఏది.. కత్రినా హాట్ సాంగ్‌పై నెటిజన్ల ఫైర్..

Jai Bhim – Raghava Lawrence: మరోసారి దాతృత్వం చాటుకున్న లారెన్స్.. జై భీమ్ రియల్ ‘సినతల్లి’కి భారీ సాయం..

Pradeep Machiraju: మహాభారత యుద్ధంలో కౌరవ..పాండవ సేనకు భోజనం పెట్టింది ఎవరు? ఆహా..అనిపించిన ప్రదీప్!