Samantha: నాగ చైతన్య హీరోయిన్ పై సమంత ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నదంటే
తెలుగులో చివరిగా విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో నటించింది. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సామ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది సమంత. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ హీరోయిన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా ఇప్పటికీ ఈ చిన్నదానికి అదే క్రేజ్ ఉంది. సామ్ సినిమాలకు ఒక ఏడాది బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. దాంతో సమంత ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తెలుగులో చివరిగా విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో నటించింది. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సామ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది సమంత. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ హీరోయిన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అది కూడా నాగచైతన్య హీరోయిన్ పై కామెంట్స్ చేసింది సామ్. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
నాగ చైతన్య, సమంత ]ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కానీ మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. అయితే సమంత ఇప్పుడు నాగ్ చైతన్య హీరోయిన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. సాయి పల్లవి హీరోయిన్ కాకముందు పలు డాన్స్ షోల్లో పాల్గొంది.
వాటిలో ఢీ షో ఒకటి సాయి పల్లవి డాన్స్ చేసిన ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా సమంత హాజరయ్యింది. సాయి పల్లవి గురించి చెప్తూ.. ఆమె డాన్స్ అద్భుతం.. ఆమె డాన్స్ చేస్తుంటే అలా చూస్తూనే ఉండిపోయా అని తెలిపింది సామ్. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి నాగ చైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది.తండేల్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మత్యకారుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
