టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను సౌత్ టూ నార్త్ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను మయోసైటిస్ వ్యాధిని ఎదుర్కొవడం.. వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన విడాకులపై మరోసారి స్పందించారు సామ్. వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయితీగా ఉన్నానని.. కాకపోతే అది వర్కౌట్ కాలేదని అన్నారు. అంతేకాకుండా పుష్ప సినిమాలో తాను చేసిన స్పెషల్ సాంగ్ గురించి కూడా ప్రస్తావించారు సామ్.
విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే తనకు పుష్ప చిత్రంలో ఊ అంటావా ఆఫర్ వచ్చిందని.. తాను తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించిందని.. అందుకే ఆ సాంగ్ చేసేందుకు ఓకే చేసేశాను అని చెప్పుకొచ్చింది సామ్. ఆ సాంగ్ అనౌన్స్ చేసినప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు ఫోన్లు చేసి.. ఇంట్లో కూర్చో చాలు.. విడిపోయిన వెంటనే నువ్వు ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదని సలహాలు ఇచ్చారని.. తనను ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు సైతం ఆ సాంగ్ చేయొద్దనే అన్నారని.. కానీ వారి మాటలు పట్టించుకోకుండా.. ఆ సాంగ్ చేసినట్లు తెలిపారు సామ్. “వైవాహిక బంధంలో నేను 100 శాతం నిజాయితీగా ఉన్నాను. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసినట్టు ఎందుకు దాక్కోవాలి ? నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని.. ఎందుకు బాధపడాలి ? ఇప్పటికే నేను చాలా బాధలు పడ్డాను. నటిగా ప్రతి విషయంలో ఫర్ఫెక్ట్ గా ఉండాలని మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నాను. మయోసైటిస్, మెడికేషన్ కారణంగా నాపై నాకే కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల ఒక్కోసారి నేను నీరసంగా కనిపిస్తాను..
మరోసారి బొద్దుగా కనిపిస్తాను. నేను స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని అందురూ అనుకుంటారు. కానీ నిజం అదికాదు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురిని నా కళ్లు తట్టుకోలేవు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏ నటికి రాకూడదు. ఎందుకంటే కళ్లతోనే నటీమణులు భావాలు పలికించారలి. గడిచిన ఎనిమిది నెలలుగా ప్రతి రోజూ నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. బాధను అనుభవిస్తూనే ఉన్నాను. అన్నింటినీ దాటుకుని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి.. ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్ గురించి కామెంట్స్ చేసిన పట్టించుకోను.. ఎన్నో పోరాటాలు చేశాను.. ప్రస్తుతం శారీరకంగా బాగున్నాను. గత రెండేళ్లలో ఓ వ్యక్తిగా నేను చాలా మారాను. మానసికంగా.. శారీకంగా… ఆధ్యాత్మికంగా నాపై వచ్చే ప్రతి మాటను నేను స్వీకరించేలా చేసింది. వారు గెలిచారని నేను అనుకోనూ.. కానీ ఇప్పటికీ నేనే గెలుస్తూనే ఉన్నాను.. ప్రతిదీ మంచిగా ఉన్నప్పుడు అక్కడ పెరుగుదల ఉండదు ” అంటూ చెప్పుకొచ్చారు సమంత.
“When we won’t do any mistake then why should we hide” That was a WINNER quality Sam ??
Sam: Okay iam doing it ??♥️#OoAntavaOoOoAntava ?
Do what makes your heart says love ?#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/3ZeyNIp92b
— SamAnu?{ShaakuntalamOnApril14th ?} (@SamzCraziestFan) March 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.