Samantha: టాలీవుడ్‌లోనూ మహిళా కమిటీ వేయాలి.. సమంత షాకింగ్ పోస్ట్
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు హేమ కమిటీ నివేదిక బయట పెట్టింది. ఇన్ని నివేదికలో పేర్కొన్నప్పటికీ లైంగికంగా వేధించిన వారి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
జస్టిస్ హేమా కమిటీ నివేదికలో 290 పేజీలు సమర్పించింది. మాయల ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పై హేమ కమిటీ ఇచ్చిన నివేదిక చూసి అందరూ షాక్ అవుతున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు హేమ కమిటీ నివేదిక బయట పెట్టింది. ఇన్ని నివేదికలో పేర్కొన్నప్పటికీ లైంగికంగా వేధించిన వారి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నివేదిక వెలువడిన తర్వాత సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారు లేవనెత్తిన ఆరోపణల ఆధారంగా తదుపరి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఇక ఇప్పటికే చాలా మంది నటీమణులు బయటకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను గుర్తి చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ
అలాగే చాలా మంది హేమ కమిటీ పై మాట్లాడుతున్నారు. ఇటీవలే నటి షకీలా, హీరో విశాల్ కూడా హేమ కమిటీ గురించి మాట్లాడారు. కోలీవుడ్ లోనూ హేమ కమిటీ ఏర్పాటు చేయాలనీ విశాల్ కోరారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా హేమ కమీషన్ రిపోర్ట్ పై స్పందించింది. ఈమేరకు సమంత సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. టాలీవుడ్‌లోనూ కేరళ తరహా మహిళా కమిటీ వేయాలని సమంత కోరింది.
ఇది కూడా చదవండి : Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు
సమంత తన సోషల్ మీడియా ఇలా రాసుకొచ్చింది..” కేరళ ఇండస్ట్రీలో హేమకమిటీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా.. 2019లో టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ రిపోర్టును ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలి. టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ కేరళ బాటలో నడవాలి. టాలీవుడ్‌లోనూ కేరళ తరహా మహిళా కమిటీ ఏర్పాటు చేయాలి అని సమంత రాసుకొచ్చింది. ఇప్పుడు సమంత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ మాట్లాడిన విషయం తెలిసిందే.. తాజాగా సమంత చేసిన కామెంట్స్ తో టాలీవుడ్ చిన్నపాటి దుమారం రేగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.