సెంటిమెంట్ ఫాలో అవుతోన్న సమంత..కాలినడకన వెళ్లి శ్రీవారి దర్శనం

ప్రముఖ నటి, అక్కినేని నాగచైతన్య భార్య సమంత కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5న విడుదల కానుండటంతో సమంత స్నేహితురాలు, ప్రముఖ తమిళ నటి రమ్య సుబ్రమణియన్‌తో కలిసి కాలినడకన 3,500 మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనంతరం టీఎస్ఆర్ అతిథి భవనంలో విశ్రాంతి తీసుకుని మంగళవారం ఉదయం సుప్రభాతసేవలో […]

సెంటిమెంట్ ఫాలో అవుతోన్న సమంత..కాలినడకన వెళ్లి శ్రీవారి దర్శనం

ప్రముఖ నటి, అక్కినేని నాగచైతన్య భార్య సమంత కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5న విడుదల కానుండటంతో సమంత స్నేహితురాలు, ప్రముఖ తమిళ నటి రమ్య సుబ్రమణియన్‌తో కలిసి కాలినడకన 3,500 మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనంతరం టీఎస్ఆర్ అతిథి భవనంలో విశ్రాంతి తీసుకుని మంగళవారం ఉదయం సుప్రభాతసేవలో శ్రీ వారిని దర్శించుకుని శ్రీవారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.

కాగా గతంలో కూడా తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ సమంత కాలినడకన వెళ్లి శ్రీవారిని ఆశీస్సులు తీసుకున్నారు. అప్పుడు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ‘ఓ బేబీ’ చిత్ర రిలీజ్‌కు ముందు సమంత తిరుమలకు కాలినడకన వెళ్లడం విశేషం.