Salman Khan: సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న భాయ్‌జాన్‌

ఓ క్రేజీ సీక్వెల్ ఇప్పుడు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ట్రెండ్ అవుతోంది. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్‌.

Salman Khan: సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న భాయ్‌జాన్‌
Salman Khan

Edited By:

Updated on: Jul 18, 2023 | 8:38 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ మరో ఇంట్రస్టింగ్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఒకప్పుడు సౌత్ బ్లాక్ బస్టర్స్‌తో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన భాయ్‌జాన్ ఇప్పుడు ఆ క్యారెక్టర్స్‌కు తనదైన స్టైల్‌లో సీక్వెల్స్‌ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ క్రేజీ సీక్వెల్ ఇప్పుడు న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ట్రెండ్ అవుతోంది. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్‌. సౌత్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. కిక్ సినిమాలో హీరో క్యారెక్టర్ సల్మాన్ ఇమేజ్‌కు బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్‌ అవ్వటంతో నార్త్‌లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

కిక్ సక్సెస్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని భావించారు భాయ్‌జాన్‌, కానీ సరైన కథ దొరక్కపోవటంతో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. లాంగ్ వెయిటింగ్ తరువాత కిక్కించే కథ సెట్ అయ్యింది. త్వరలో సిల్వర్‌ స్క్రీన్ మీద మరోసారి డెవిల్‌ పాత్రలో కనిపించబోతున్నారు సల్మాన్‌.

తొలి భాగానికి దర్శకత్వం వహించిన సాజిద్ నదియావాలా సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. అప్పట్లో రీజినల్‌ రేంజ్‌లోనే కిక్‌ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌ నడుస్తుండటంతో ఆ రేంజ్‌కు తగ్గ కథను సిద్ధం చేస్తున్నారు సాజిద్‌.  తొలి భాగంలో సెకండ్ హీరోగా బాలీవుడ్ స్టార్ రణదీప్‌ హుడా కనిపించారు. కానీ సీక్వెల్‌లో మాత్రం ఓ సౌత్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట భాయ్‌. రీసెంట్‌ టైమ్స్‌లో సౌత్‌ సినిమాతో మంచి రాపో మెయిన్‌టైన్ చేస్తున్న సల్మాన్‌, కిక్‌ 2తో సౌత్‌లో సాలిడ్ మార్కెట్‌ క్రియేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు.