Sai Pallavi: “నేను బాధపడను.. రాసిపెట్టిలేదు అని సరిపెట్టుకుంటా”.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్

ప్రేమమ్ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలర్ పాత్రలో సాయి పల్లవి చాలా సహజంగా నటించి మెప్పించింది.

Sai Pallavi: నేను బాధపడను.. రాసిపెట్టిలేదు అని సరిపెట్టుకుంటా.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్
Sai Pallavi

Updated on: Oct 29, 2022 | 4:40 PM

సాయి పల్లవి.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ ముద్దుగుమ్మ అయిన సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రేమమ్ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలర్ పాత్రలో సాయి పల్లవి చాలా సహజంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అవకాశం వచ్చింది. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిన్నదానికి ఫిదా సినిమాను ఆఫర్ చేశారు. ఈ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణ పిల్లగా ఈ సినిమాలో సాయి పల్లవి నటన సూపర్ అనే చెప్పాలి. చూడటానికి అచ్ఛం మన తెలుగింటి అమ్మాయిగా కనిపిచే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

తెలుగులో సాయి పల్లవి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. యంగ్ హీరోల సరసన నటిస్తూ మంచి హిట్స్ ను అందుకుంటోంది. ఇక ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే గార్గి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది.

తాజాగా సాయి పల్లవి చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్ తాము వదులుకున్న సినిమా మంచి హిట్ అయితే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాం అని బాధపడుతూ ఉంటారు. కానీ సాయి పల్లవి అలా ఫీల్ అవ్వదట. “మిస్ చేసుకున్న పాత్రలు గుర్తు చేసుకుని ఎప్పుడు నేను బాధపడను అలాంటి మంచి పాత్రలు మనకు రాసి పెట్టలేదు ఇది విదిరాత అని మాత్రమే భావిస్తాను తప్ప ఎప్పటికీ బాధపడను” అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి