Naatu Naatu: ఆస్కార్ అందుకున్న నాటు నాటు సాంగ్‌ను అద్భుతంగా పేరడీ చేశాడు.. ఈ కుర్రాడి టాలెంట్ సూపర్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సంచలన మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.

Naatu Naatu: ఆస్కార్ అందుకున్న నాటు నాటు సాంగ్‌ను అద్భుతంగా పేరడీ చేశాడు.. ఈ కుర్రాడి టాలెంట్ సూపర్
Rrr
Follow us

|

Updated on: Mar 16, 2023 | 2:36 PM

ఆస్కార్.. అంతా ఆషామాషీ కాదు దీన్ని అందుకోవడం. కానీ మన సినిమా దాన్ని సొంతం చేసుకుంది. తెలుగు జాతి గర్వంగా రొమ్మువిరుచుకు నిలుచునేలా చేసింది ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సంచలన మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఎక్కడ విన్నా నాటు నాటు పతే వినిపిస్తోంది. అమెరికా మొత్తం మన సాంగ్ గురించే చర్చ. ఇప్పటికే చాలా మంది ఈ పాటలోని హుక్ స్టెప్ ను చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాటు నాటు సాంగ్ ను పేరడీ చేశాడు విజయనగరానికి చెందిన సాయి కృష్ణ.

నాటు నాటు సాంగ్ ను ప్రశంసిస్తూ.. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గురించి వివరిస్తూ ఎంతో అద్భుతంగా పాటను ఆలపించారు సాయి కృష్ణ. ఈ టాలెంటెడ్ పర్సన్ వృత్తిరీత్యా హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. అయినా సినిమాల పై మక్కువ .. పాటలు రచించడంలో ఆసక్తితో పలు ప్రయివేట్ సాంగ్ చేశాడు.

తన భార్య రామాంజలి ప్రోత్సాహంతో సాయి కృష్ణ నాటు నాటు సాంగ్ ను పేరడీ చేశాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటతో పాటు ఫోక్ సాంగ్స్ , భక్తి పాటలను కూడా రచించి .. ఆలపించారు సాయి కృష్ణ. ఈ పాట వింటే సాయి కృష్ణకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.. ఈ పాట పై మీరూ ఓ లుక్కేయండి.