Manchu Manoj: ‘ఎన్ని త్యాగాలు చేశావో నాకు తెలుసు.. నీకు నేనున్నా’.. మంచు మనోజ్‌కు సపోర్టుగా టాలీవుడ్ హీరో

సుమారు ఎనిమిదేళ్ల తర్వాత మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అతను నటించిన తాజా చిత్రం భైరవం. శుక్రవారం (మే30) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ కు టాలీవుడ్ హీరోలు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Manchu Manoj: ఎన్ని త్యాగాలు చేశావో నాకు తెలుసు.. నీకు నేనున్నా.. మంచు మనోజ్‌కు సపోర్టుగా టాలీవుడ్ హీరో
Manchu Manoj

Updated on: May 29, 2025 | 5:11 PM

మంచు మనోజ్ చివరిగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాలో కనిపించాడు. ఇప్పుడు మళ్లీ సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు. అతను నటించిన తాజా చిత్రం భైరవం. మనోజ్ తో పాటు బెల్లం కొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించారు. విజయ్ కనక మేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా రాధా మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే భైరవం సినిమా హీరోలతో కలిసి మెగా మేనల్లుడు, హీరో సాయి దుర్గా తేజ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. తాజాగా అతను మంచు మనోజ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

మనోజ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసిన సాయి దుర్గ తేజ్.. ‘ బాబాయ్.. నువ్వు ఇన్ని రోజులు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నందుకు కోపంగా ఉంది. కానీ నువ్వు జీవితంలో ఎన్ని త్యాగాలు చేశావో నాకు తెలుసు. స్క్రీన్‌ పై నీ ఎనర్జీ, తెరపై నువ్వు కనిపించే విధానం అన్నిటికీ నేను వీరాభిమానిని. జీవితంలో నువ్వు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఇన్నిరోజులు బిగ్‌ స్క్రీన్‌ పై నిన్ను మిస్‌ అయ్యాను. గజపతి పాత్ర నీ కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుంది. నా బాబాయ్‌వి, సోదరుడివి కుటుంబసభ్యుడి కంటే ఎక్కువ. నీ కమ్ బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నాను. ఆల్ ది బెస్ట్’ అని పోస్ట్ లో రాసుకొచ్చాడు సాయి దుర్గా తేజ్. అలాగే నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లను కూడా మెగా హీరో విష్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ తో సాయి దుర్గ తేజ్..

భైరవం హీరోలతో మెగా మేనల్లుడు..

 

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.