Sai Dharam Tej: నేటితో టాలీవుడ్‌లో హీరోగా అడుగు పెట్టిన ఏడేళ్లు.. ఆదరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్న మెగా మేనల్లుడు

|

Nov 14, 2021 | 7:18 PM

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టి నేటితో 7 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో తేజు తాజాగా ఓ వీడియో సోషల్..

Sai Dharam Tej: నేటితో టాలీవుడ్‌లో హీరోగా అడుగు పెట్టిన ఏడేళ్లు.. ఆదరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్న మెగా మేనల్లుడు
Sai Dharam Tej
Follow us on

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టి నేటితో 7 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో తేజు తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈరోజు నటుడిగా నా ప్రయాణం మొదలై ఏడు ఏళ్ళు అయ్యాయి. నటుడిగా వెండి తెరపై కనిపించాలనే నా అభిరుచి నిజమైంది. నా మొదటి సినిమా నుండి అభిమానులు నన్ను హృదయపూర్వకంగా ఆదరించారు. అంతేకాదు నా జీవితంలో ఎదురైనా ఒడిదుడుకులలో నాకు తోడుగా ఉన్నారు. మీ అమూల్యమైన ప్రేమకు నా సినీ ప్రయాణాన్ని అందంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సాయి ధరమ్ తేజ్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం రిలీజై ఏడేళ్లు పూర్తి అయ్యింది.  మెగా మేనల్లుడిగా సినీ ప్రయాణం మొదలు పెట్టినా.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తేజ్ తన ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా స్పెషల్ ట్వీట్ చేశాడు. నిజానికి తేజు రేయ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవాల్సి ఉంది. అయితే పిల్లా నువ్వులేని జీవితం మొదట రిలీజ్ అయింది. రేయ్ సినిమా తర్వాత రిలీజ్ అయింది. ఈ ఏడేళ్ల సినీ జర్నీలో .. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్,ప్రతి రోజు పండగే, చిత్రలహరి  వంటి హిట్‌ చిత్రాలలో నటించాడు. కొన్ని నెలల క్రితం తేజుకి యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం నుంచి కోలుకున్న తేజు.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే సాయి ధరమ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్.. తేజు నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. త్వరలోనే తేజ్, దర్శకుడు మారుతీ కాంబోలో తేజు నటించనున్నాడు. మరోవైపు తేజు కి అభిమానుల విషెష్ తో సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.

Also Read:  తూర్పు నుంచి పశ్చిమ దిశకు ప్రవహిస్తూ.. పాపాలను తొలగించే నర్మదానది విశిష్టిత ఏమిటంటే..