Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

|

Mar 26, 2022 | 8:08 PM

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో (Road Accident) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..
Sai Dharam Tej
Follow us on

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో (Road Accident) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లోని దుర్గం చెరువు దగ్గర బైక్‌పై వెళుతున్న తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని మొదట మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మెరుగైన చికిత్స కోసం వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ మెగా హీరో బెడ్‌పై ఉండగానే అతను నటించిన రిపబ్లిక్‌ (Republic Movie) చిత్రం విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఆస్పత్రిలో సుమారు 35 రోజుల పాటు చికిత్స పొందిన తేజ్‌ అక్టోబర్‌లో డిశ్చార్జి అయ్యాడు. ఆతర్వాత కాస్త కోలుకున్న తరువాత ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. ఈక్రమంలో అప్పుడప్పుడూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ వీడియో విడుదల చేసిన ఈ మెగా హీరో.. యాక్సిడెంట్‌ తర్వాత తనను ఆస్పత్రిలో చేర్పించిన వ్యక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు . అదేవిధంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ను పంచుకున్నాడు.

ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించండి..

‘నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను ఆస్పత్రిలో ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మెడికవర్, అపోలో ఆస్పత్రి వైద్యులు, నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారు చూపించిన ప్రేమతోనే నేను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నాను. ఇక నా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ నెల 28న నా కొత్త సినిమా ప్రారంభం కానుంది. సుకుమార్, బాబీలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మళ్లీ మీ అందరి ముందుకు వస్తాను. బైక్‌పై వెళ్లే ప్రతిఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించండి’ అని ఈ సందర్భంగా కోరారు ఈ మెగా హీరో. కాగా ప్రమాదం నుండి కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ను చూసి అభిమానులు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు.

Also Read:CSK vs KKR: షాడో స్టార్ పేసర్ దెబ్బకు చెన్నై విలవిల..

Viral Video: పాపం.. సింహాన్ని చెడుగుడు ఆడుకున్న జీబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..

Summer Health Tips: వేసవి కాలం శరీరంలో డీహైడ్రేట్ సమస్యలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తెలుసుకోండి