Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా విడుదలకు రంగం సిద్ధం.. రిపబ్లిక్‌ వచ్చేది ఎప్పుడంటే..

Sai Dharam Tej: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్‌ కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించినట్లు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా విడుదలకు రంగం సిద్ధం.. రిపబ్లిక్‌ వచ్చేది ఎప్పుడంటే..

Updated on: Sep 18, 2021 | 7:56 PM

Sai Dharam Tej: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్‌ కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించినట్లు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే గత పదిరోజులుగా సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి సంబంధించిన వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఆయన సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. తేజ్‌, దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో ‘రిపబ్లిక్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తేజ్‌ ఇందులో ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఇక ఈ సినిమాను గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. మరి ఈ సినిమా సాయ్‌ ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: Afghan Crisis: కొన్ని వేలకోట్ల విలువజేసే 2వేల ఏళ్లనాటి నిధిపై తాలిబన్ల కన్ను… అంత డబ్బువారి చేతులో పడితే..

Viral Photo: పరుగు పందెంలో విజేతగా నిలిచిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ముక్కుసూటి తనానికి పెట్టింది పేరు ఈ స్టార్‌ హీరోయిన్‌..

AP FiberNet case: ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలపై సీఐడీ దూకుడు.. IRS అధికారి సాంబశివరావు అరెస్ట్‌