Sai Dharam Tej-Naresh: సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా…

|

Sep 11, 2021 | 9:55 PM

Sai Dharam Tej Accident: బైక్‌ రేసింగ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ  నరేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో..  తాజాగా తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. మరో వీడియో సాయంత్రం  రిలీజ్ చేశారు.

Sai Dharam Tej-Naresh: సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా...
Naresh On Teju
Follow us on

Sai Dharam Tej Accident: మెగా మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కు జరిగిన ప్రమాదంపై సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇక శ్రీకాంత్, బండ్ల గణేష్ వంటివారు నరేష్ ఈ సమయంలో మాట్లాడిన తీరు బాధాకరమని అన్నారు. నట్టి కుమారు అయితే నరేష్ తన ఇంటి నుంచి వస్తున్నారని చెప్పిన మాటలు అబద్ధాలేమో అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో తేజు యాక్సిండెంట్ పై  సీనియర్‌ నటుడు నరేశ్‌ మరోసారి స్పందించారు. బైక్‌ రేసింగ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ  నరేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో..  తాజాగా తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. మరో వీడియో సాయంత్రం  రిలీజ్ చేశారు.

తాను పొద్దున్నే సాయితేజ్‌ గురించి ప్రార్థించాను. చాలా ఫాస్ట్‌గా రికవరీ అవుతున్నాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తాడని నరేష్ చెప్పారు. అంతేకాదు తాను పొద్దున్న వీడియోలో స్పష్టంగా చెప్పాను. సాయి ధరమ్ తేజ్, నవీన్ లు కలిసి బయలుదేరిన మాట వాస్తవమే.. ఇద్దరూ ఓ చాయ్‌ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఓపెనింగ్ తర్వాత   ఎవరికీ వారు తిరిగి వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం సమయంలో క్లిపింగ్ లో 60-70 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్లినట్లు కనిపిస్తుంది. రోడ్డుపై ఉన్న మట్టి కారణంవలన సాయి ధరమ్ తేజ్ బైక్ జారీ కింద పడి ప్రమాదానికి గురయ్యాడు.  అంతేకాని ఈ ప్రమాదం నిర్లక్ష్యం వలన జరిగింది కాదని చెప్పారు. ప్రమాదం జరిగింది. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మరో ఆలోచన లేదు. సాయితేజ్‌ క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ నరేష్ మరోసారి తేజు ప్రమాదంపై .. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

 

 

Also Read: యంగస్టర్స్ లో సాయి ధరమ్ మెచ్యూర్డ్ ప‌ర్స‌న్.. నరేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న శ్రీకాంత్, నట్టి కుమార్..

Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్

Sai Dharam tej: తేజు మీదనే కాదు.. మున్సిపాలిటీపై, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసుపెట్టమంటున్న మ్యూజిక్ డైరెక్టర్

Sai Dhram Tej-Naveen: చరణ్ ఫ్రెండ్ నవీన్.. తేజుకి ఎలా స్నేహితుడు అయ్యాడంటే.. తేజు మొదటి క్రికెట్ గురువు ఎవరో తెలుసా..!