Sai Daram Tej: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగించిన అపోలో వైద్యులు..

Sai Daram Tej: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి. ఆయన స్పృహలోకి..

Sai  Daram Tej:  స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగించిన అపోలో వైద్యులు..

Updated on: Sep 18, 2021 | 4:51 PM

Sai Daram Tej: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి. ఆయన స్పృహలోకి వచ్చారని అపోలో ఆస్పత్రి సిబ్బంది ప్రకటించారు. అంతేకాదు తేజు కి వెంటిలేటర్ ను  తొలగించినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజుల పాటు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉందని తెలిపారు. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు.. తనంతట తానే సాయిధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పిన డాక్టర్లు తెలిపారు. ఇక తేజుకి ప్రమాదం జరిగినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళన చోటు చేసుకుంది. మెగా అభిమానులు తేజు కోలుకోవాలంటూ.. అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

వినాయక చవితి రోజున బైక్ పై ప్రయాణిస్తూ రోడ్డుమీద ఇసుక ఉండడంతో సాయిధరమ్ తేజ్ అదుపుతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన సాయిధరమ్ తేజ్‌ని మెడికవర్‌కి మొదట తరలించారు. అక్కడ  ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించారు.