Saaho: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!
‘బాహుబలి’ ప్రభాస్ నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రభాస్ అభిమానులు సుమారు లక్షమందికి సరిపోయే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది. ఇక వేడుక ప్రారంభమైన తరవాత ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులకు […]

‘బాహుబలి’ ప్రభాస్ నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రభాస్ అభిమానులు సుమారు లక్షమందికి సరిపోయే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది. ఇక వేడుక ప్రారంభమైన తరవాత ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులకు చుక్కులు చూపిస్తున్నారు.
విపరీతంగా అభిమానులు పోటెత్తడం..ముందుకు వెళ్లేందుకు కొంత మంది భారీకేడ్లను పడగొట్టుకుని ముందుకు వచ్చేస్తుండంతో పోలీసులకు కంట్రోల్ చెయ్యడం కష్టతరంగా మారింది. యాంకర్స్ సుమ, హేమంత్ సంయమనంతో ఉండాలని ఫ్యాన్స్‌కు పదే పదే మైక్‌లో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పోలీసులు డ్రోన్ కెమెరా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ప్రభాస్ ఎంట్రీ అవ్వలేదు. ఆయన ఎంట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసమే 2 కోట్ల 50 లక్షలు ఖర్చు పెడుతోంది.
ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: