Telugu Indian Idol: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెలుగు ఇండియన్ ఐడల్.. జడ్జిగా వ్యవహరించేది ఆయనేనా..?

తెలుగు ప్రేక్షకులకు నిరంతరం అద్భుతమైన కంటెంట్ ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాలను ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను అందిస్తున్న ఆహా ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంటుంది.

Telugu Indian Idol: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెలుగు ఇండియన్ ఐడల్.. జడ్జిగా వ్యవహరించేది ఆయనేనా..?
Telugu Indian Idol

Edited By: Shiva Prajapati

Updated on: Jan 12, 2022 | 4:34 PM

Telugu Indian Idol: తెలుగు ప్రేక్షకులకు నిరంతరం అద్భుతమైన కంటెంట్ ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాలను ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను అందిస్తున్న ఆహా ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంటుంది. ప్రతి వారం సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేయడమే కాకుండా.. ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఆహా. ఇక ఆహా లో టెలికాస్ట్ అవుతున్న నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆహా మరో అడుగు ముందుకు వేసి ఇండియన్ ఐడల్ తో రెడీ అవుతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయినా ఈ సింగింగ్ కాంపిటేషన్ ను ఇప్పుడు ఆహా తెలుగులోకి తీసుకురానుంది. అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకునే సింగర్స్ ను ఇప్పుడు ఆహా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

ఇక ఇప్పుడు ఓటీటీ సంస్థ ఆహా.. దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించే కార్యక్రమం ఇండియన్ ఐడల్ తెలుగులోకి తీసుకురానుంది. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఊర్రూతలూగించే ఈ షో ఇక పై తెలుగులో రానుంది. ఇండియన్ ఐడల్ సింగింగ్ షోను తెలుగులో ప్రారంభించనుంది ఆహా. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ఆడిషన్స్ కూడా జరిగిపోయాయి. త్వరలోనే ఈ కార్యక్రమం మన ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి జడ్జ్ గా ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తారని తెలుస్తుంది. మరి ఈ  వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడ. తమన్ చేతిలో ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో తమన్  ఇండియన్ ఐడల్ షోకు జడ్జి గా వ్యవహరిస్తాడా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్