Payal Rajput: కావాల్సినంత అందం ఉన్న అందని హిట్లు.. హాట్ బ్యూటీ ఆశలన్నీ ఇప్పుడు ఆ సినిమా పైనే
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను తన మాయలో పాడిసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్(Payal Rajput) . కావాల్సినంత అందాలు ఒలకబోసి కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ వయ్యారి
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను తన మాయలో పడేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్(Payal Rajput) . కావాల్సినంత అందాలు ఒలకబోసి కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ వయ్యారి. తొలి సినిమాలోనే రెచ్చిపోయి అందాలు ఆరబోసిన పాయల్.. ఆ సినిమాతో మంచి హిట్ ను కూడా అందుకుంది. అయితే ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత పాయల్ కు ఆఫర్లు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడిని క్రేజీ ఆఫర్లు అందడమే లేదు. ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా నటించిన డిస్కో రాజా సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఆ తర్వాత వెంకటేష్ సరసన వెంకీమామ సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకున్న పాయల్ కు అనుకున్నంత పేరురాలేదు. ఇక రీసెంట్ గా తీస్మార్ ఖాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో ఆదిసాయి కుమార్ హీరోగా నటించారు. అందం అభినయం ఉన్న ఈ భామకు ఈ సినిమాకూడా కలిసిరాలేదు. దాంతో ఇప్పుడు ఈ ఢిల్లీబ్యూటీ ఆశాలన్ని మంచు హీరో సినిమా పైనే పెట్టుకుంది. మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. సూర్య అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మారోహాట్ బ్యూటీ సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు విష్ణు. విష్ణు సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది పాయల్. మరి ఈ ఇద్దరి ఆశలను జిన్నా సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
View this post on Instagram