Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..
Mahesh Babu

Updated on: Apr 04, 2022 | 5:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కిర్తీ సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు.. ఈ మూవీ నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ వార్త ఆందోళన కలిగిస్తోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సర్కారును తీసుకొద్దామని థింక్ చేసిన మహేష్… ఆ తరువాత వచ్చిన కరోనాకు… ఆ వెంటనే వచ్చిన నీల్‌ సర్జరీకి సైలెంట్‌ అయిపోయారు. ఇక ఇటీవల ఆగమేఘాల మీద ఈ సినిమాను ఫినిస్ చేసేందుకు ఈ ప్రిన్స్ ప్లాన్ చేసినప్పటికీ… అనుకున్నంత స్పీడ్‌గా ఈ షూటింగ్ జరగడంలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ టాక్‌తో పాటే… సర్కారు వారి పాట వాయిదా పడుతుందనే టాక్‌ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి ఈ సినిమాను మే 12న రిలీజ్‌ చేస్తామని కరోనా థర్డ్ ఫేజ్ అయిపోగానే అనౌన్స్ చేసింది సర్కారు వారి పాట చిత్రయూనిట్. అయితే రీసెంట్‌గా ఉగాదికి సందర్భంగా రిలీజ్‌ చేసిన సర్కారు పోస్టర్‌లో మే 12 డేట్‌ను తాటికాయంత అక్షరాలతో మెన్షన్ చేసినప్పటికీ… ఈ టాక్ ఆగడం లేదు సరికదా… సోషల్ మీడియాలోకి కూడా ఎంటరైపోయింది. మరి ఈ రూమర్‌పై ఈ మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..