RRR Release Highlights: సత్తా చాటుతున్న ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ పై కొనసాగుతోన్న దండయాత్ర

| Edited By: Ram Naramaneni

Mar 25, 2022 | 8:50 PM

RRR Release Theater reactions Live Updates: జాతర మొదలైంది నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా గ్రాండ్ గా రిలీజ్.

RRR Release Highlights: సత్తా చాటుతున్న ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ పై కొనసాగుతోన్న దండయాత్ర
Rrr

జాతర మొదలైంది నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా గ్రాండ్ గా రిలీజ్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ కోసం తెలుగు సినీ ప్రియులతో పాటు యావత్‌ సినీ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR. NTR) హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌, అజయ్ దేవగణ్, శ్రియా శరన్.. సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక సినిమా థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. ఇద్దరు హీరోల  అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. భారీ కటౌట్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో థియేటర్స్ ను నింపేశారు ఫ్యాన్స్. ఎక్కడ చూసినా అదే చర్చ.. ఏ ఇద్దరిని కదిలించినా.. అదే మాట. అవును ట్రిపుల్‌ ఆర్‌ క్రేజీ అంతా ఇంతాకాదు. దేశవ్యాప్తంగా ట్రిపులార్‌ మేనియా కొనసాగుతోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దర్శకధీరుడి వండర్‌ ధియేటర్లలోకి వచ్చేసింది. ట్రిపుల్‌ ఆర్‌ సినిమా రిలీజ్‌ కావడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ట్రిపుల్‌ ఆర్‌ కోసం అటు అభిమానులతో పాటు.. నటులు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు. భారీ కటౌట్లు, వందల అడుగుల ఫ్లెక్సీలతో సినిమాహాళ్లు పెళ్లికూతురులా తయారయ్యాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Mar 2022 08:49 PM (IST)

    RRR అద్భుతం అన్న హరీశ్‌ శంకర్‌.

    మైండ్‌ బ్లోయింగ్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎంతో అద్భుతంగా ఉంది. భారతీయ సినిమా గర్వించే దర్శకుడు రాజమౌళికి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు శుభాకాంక్షలు. – దర్శకుడు హరీశ్‌ శంకర్‌.

  • 25 Mar 2022 08:49 PM (IST)

    RRRపై నారా లోకేశ్ ప్రశంసలు

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మంచి స్పందన రావటం సంతోషంగా ఉంది. నటులు, సాంకేతిక బృందానికి కంగ్రాట్స్‌. నా కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని త్వరలోనే చూస్తా. ఈ సినిమా గత రికార్డులను బద్దలుకొట్టాలని ఆశిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. – తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.

  • 25 Mar 2022 05:28 PM (IST)

    RRR మూవీ చూస్తే ఎంజాయ్ చేసిన ఉపాసన

    హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన.. థియేటర్లో ఓ రేంజ్‌లో హంగామా చేశారు. RRR సినిమా చూస్తున్నంతసేపు సామాన్య అభిమానిలా మారిపోయారామె. కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ.. పేపర్లను గాల్లోకి ఎగరేస్తూ రచ్చ రచ్చ చేశారు ఉపాసన. తన వెనుక కూర్చున్న చరణ్ పై కూడా పేపర్స్ విసురుతూ హడావిడి చేశారు. ఉపాసన చేస్తున్న హంగామా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • 25 Mar 2022 03:21 PM (IST)

    యూకే, అమెరికాలో తారక్, చెర్రీ ఫ్యాన్స్ హంగామా

    ఎన్టీఆర్‌ యునసేన ఆధ్వర్యంలో యూకేలో హంగామా చేశారు తారక్‌ ఫ్యాన్స్‌. యూకేలో RRR రిలీజ్‌ అయిన థియేటర్లు జై ఎన్టీఆర్‌ నినాదాలతో దద్దరిల్లాయి. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలతో థియేటర్‌కు వచ్చి సందడి చేశారు నందమూరి అభిమానులు. అటు అమెరికాలో థియేటర్లో కేక్‌లు కట్‌చేసి సందడి చేశారు తారక్‌, చెర్రీ ఫ్యాన్స్‌. భారీ కార్ల ర్యాలీ నిర్వహించి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌పై  తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్..

  • 25 Mar 2022 03:20 PM (IST)

    ట్రిపులార్ మూవీ రివ్యూ..

    ప్యాన్‌ ఇండియా రేంజ్‌లోనే కాదు, ప్యాన్‌ వరల్డ్ రేంజ్‌లో జనాలు వెయిట్‌ చేసిన సినిమా ట్రిపుల్‌ ఆర్‌. బాహుబలి తీసిన డైరక్టర్‌, ఇద్దరు పెద్ద ఫ్యామిలీల స్టార్‌ హీరోలు చేసిన మల్టీస్టారర్‌, 500 కోట్లకు పైగా బడ్జెట్‌, అందులోనూ చారిత్రక పురుషుల పేర్లతో అల్లుకున్న ఫిక్షనల్‌ స్టోరీ.. ఎన్నో, ఎన్నెన్నో అంచనాల మధ్య విడుదలైంది ట్రిపుల్‌ ఆర్‌.

    ట్రిపుల్ ఆర్ మూవీ రివ్యూ చదవండి..

  • 25 Mar 2022 03:17 PM (IST)

    ట్రిపులార్ మూవీతో స్టార్ హీరో రేంజ్‌కి చేరిన జక్కన్న క్రేజ్

    ట్రిపులార్ సినిమాలో ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు అన్నట్లుగా ఉంది హైదరాబాద్‌లో జోష్. వరుస హిట్స్‌తో పాటు ట్రిపులార్ మూవీతో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తారక్‌, చరణ్‌తో పాటు జక్కన్నకు హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ దగ్గర భారీ కటౌట్‌ ఏర్పాటు చేయడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపించింది. ఈ భారీ కటౌట్‌కు పాలాభిశేకాలు, పూల దండలు వేసి కొబ్బరికాయలు కొట్టారు అభిమానులు.

    Ss Rajamouli

  • 25 Mar 2022 03:13 PM (IST)

    ట్రిపుల్ ఆర్ మూవీపై ఫ్యాన్ ఏమంటున్నారంటే..?

    సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌.. రాజమౌళి మాస్టర్ మైండ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నాలుగేళ్ల శ్రమ, కష్టానికి ప్రతిరూపం ఈ ట్రిపుల్ ఆర్ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మెగా, ఎన్టీఆర్ అభిమానుల కోలాహలమే కనిపిస్తోంది. రావడం కాస్త లేటయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ దునియాలో కుంభస్థలాన్ని ఢీ కొట్టింది. థియేటర్స్ నుంచి బయటికి వచ్చే అభిమానుల జోష్ చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. అసలు ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

    ట్రిపుల్ ఆర్ పబ్లిక్ టాక్ చూడండి..

  • 25 Mar 2022 03:11 PM (IST)

    మరో విషాద ఘటన.. అభిమాని ఆత్మహత్య

    అనంతపురం: ట్రిపుల్ ఆర్ సినిమా నేపథ్యంలో కళ్యాణదుర్గంలోని మారెమ్మ గుడి వీధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి మానేసి సినిమా చూసేందుకు వెళ్లినందుకు తల్లిదండ్రులు మందలించారని శంకర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • 25 Mar 2022 12:23 PM (IST)

    థియేటర్ వద్ద గన్ తో అభిమాని హల్చల్

    పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా థియేటర్ వద్ద గన్ తో అభిమాని హల్చల్.. సినిమా ధియేటర్ లో తెరముందు గన్ తో తిరుగుతూ కెరింతలు. నిజం తూపాకినా..డమ్మినా తెలియక నివ్వెర బోయిన అభిమానులు.

  • 25 Mar 2022 11:58 AM (IST)

    ఆర్ఆర్ఆర్ థియేటర్ వద్ద అభిమానులు అన్నదానం.

    RRR మూవీ హిట్ టాక్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంభంపాడు అభిమానుల ఆధ్వర్యంలో ప్రేక్షకులకు భోజన ఏర్పాట్లు చేశారు. పెదకూరపాడు హుస్సేన్ బాబా థియేటర్ వద్ద అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

  • 25 Mar 2022 11:17 AM (IST)

    రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు ఎదుట కొబ్బరికాయలు కొట్టిన ఫ్యాన్స్..

    విశాఖలో RRR మూవీ ప్రదర్శిత థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు.  తొలి షో చూసాక అభిమానుల కేరింతలు కొట్టారు.  సినిమా హిట్ టాక్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటు సందడి చేస్తున్నారు.  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు ఎదుట కొబ్బరికాయలు కొడుతూ.. డబ్బులు, డ్యాన్సులతో సంబరాలు చేస్తున్నారు అభిమానులు.

  • 25 Mar 2022 11:10 AM (IST)

    ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మెగా ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన

    ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మెగా ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన చేపట్టారు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. 100 మందికి పైగా అల్లూరి గెటప్ లో రోడ్ షో చేశారు. జై రామ్ చరణ్ అంటు నినాదాలతో హోరెత్తించారు.

  • 25 Mar 2022 10:47 AM (IST)

    విజయవాడలోని ఓ థియేటర్ లో టెక్నీకల్ ప్రాబ్లమ్

    విజయవాడలోని ఓ థియేటర్ లో టెక్నీకల్ ప్రాబ్లమ్ తో షో నిలిపివేశారు. సినిమా చూస్తుండగా సాంకేతిక లోపంతో బ్రేక్ పడింది. శాటిలైట్ సిగ్నల్ ప్రాబ్లమ్ వచ్చిందన్న థియేటర్ యాజమాన్యం.

  • 25 Mar 2022 10:27 AM (IST)

    విజయ సంబరాలు జరుపుకుంటోన్న ఫ్యాన్స్

    తూర్పుగోదావరి జిల్లా తుని లో ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్  హడావుడి చేశారు. బెనిఫిట్ షో అనంతరం టపాసులు పేల్చి అభిమానులు విజయ సంబరాలు జరుపుకున్నారు. కాబోయే సీఎం ఎన్టీర్ అని అభిమానులు నినాదాలు.

  • 25 Mar 2022 10:26 AM (IST)

    సినిమాపై సెన్సేషన్‌ కామెంట్స్ చేసిన కేఆర్కే

    సినిమాపై సెన్సేషన్‌ కామెంట్స్ చేశారు క్రిటిక్ KRK అలియాస్ కమల్ R ఖాన్‌. ఇండియా సినిమా చరిత్రలో ఇంతకంటే చెత్త సినిమా లేదన్నారాయన. 6వందల కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా పొరపాటు కాదు.. రాజమౌళి చేసిన నేరమంటూ విరుచుకుపడ్డారు.

  • 25 Mar 2022 10:12 AM (IST)

    కాబోయే సీఎం తారక్ అంటూ నినాదాలు..

    థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ క్సహిస్తున్నారు. పలు థియేటర్స్ లో హీరోల పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తూ హంగామా చేస్తున్నారు. కాబోయే సీఎం తారక్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్.

  • 25 Mar 2022 10:08 AM (IST)

    రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులు

    చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అభిమానుల కోసం ఆర్‌ఆర్‌ఆర్ బెన్‌ఫిట్ షో చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

  • 25 Mar 2022 09:56 AM (IST)

    ఆర్ఆర్ఆర్ మూవీ పై ట్వీట్ చేసిన నారా లోకేష్

    ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చేస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు నారా లోకేష్. ఖచ్చితంగా ఈ వారంలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తామని.. సినిమా అన్ని రికార్డులను తిరగరాస్తుందని అన్నారు లోకేష్. అలాగే చిత్రయూనిట్ కు కంగ్రాట్స్ చెప్పారు లోకేష్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • 25 Mar 2022 09:35 AM (IST)

    థియేటర్స్ దగ్గర పాలాభిషేకాలు..

    థియేటర్స్ దగ్గర పాలాభిషేకాలు.. జిల్లాల్లో ఏకంగా లారీల్లో సినిమాకు వెళ్తున్న అభిమానులు. పలు చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. కొందరు అభిమానులకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి.

  • 25 Mar 2022 09:29 AM (IST)

    సినిమా చూస్తూ అభిమాని గుండెపోటుతో మృతి

    అనంతపురంలో  ఆర్ఆర్ఆర్ఆర్ చూస్తూ అభిమాని గుండెపోటుతో మృతి..

  • 25 Mar 2022 08:56 AM (IST)

    అనూహ్యమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్

    ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల.RRR అనూహ్యమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. నార్త్‌తో పాటు మిగిలిన భాషల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌ అదరగొట్టేలా వున్నాయి. తొలిరోజు గ్రాస్ కలెక్షన్స్150నుంచి 200 కోట్లు వుంటాయని అంచనా.

  • 25 Mar 2022 08:53 AM (IST)

    పోటెత్తిన ఫ్యాన్స్ లాఠీలకు పని చెప్పారు పోలీసులు.

    విజయనగరంలో జిల్లావ్యాప్తంగా RRR సందడి కనిపిస్తోంది. పోటెత్తారు అభిమానులను కంట్రోల్ చేయడానికి లాఠీలకు పని చెప్పారు పోలీసులు. అయినా ఫ్యాన్స్‌ మాత్రం ఆగడం లేదు. థియేటర్లవైపు దూసుకొస్తున్నారు. RRR రోరింగ్‌, అభిమానుల కేరింతలతో దద్దరిల్లుతున్నాయి థియేటర్లు.

  • 25 Mar 2022 08:43 AM (IST)

    కాకినాడలో తారక్, చరణ్ ఫ్యాన్స్ షోలకు విడివిడిగా థియేటర్లు

    కాకినాడలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. లారీలో థియేటర్ వద్దకు తరళివచ్చారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ జెండాలతో థియేటర్ల వద్ద సందడి చేశారు. కాకినాడలో తారక్, చరణ్ ఫ్యాన్స్ షోలకు విడివిడిగా థియేటర్లు కేటాయించారు.

  • 25 Mar 2022 08:36 AM (IST)

    టిక్కెట్లు కోసం రోడ్డుపై బైఠాయించిన ఎంపీపీ

    తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక సెంటర్లో RRR సినిమా బెనిఫిట్ షో టిక్కెట్లు కోసం రోడ్డుపై బైఠాయించారు రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్. రాజోలు దీవిలో RRR సినిమా హక్కులు తనవేనని, నచ్చిన రేట్లకు అమ్ముకుంటాని, టిక్కెట్లు తనకే కావాలంటూ థియేటర్ ముందు బైఠాయించారు ఎంపీపీ శ్రీనివాస్. దీంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.

  • 25 Mar 2022 08:32 AM (IST)

    ఎన్టీఆర్‌ సీఎం కావాలంటూ నినాదాలు

    ఒంగోలులో ఇంట్రెస్టింగ్‌ సీన్ కనిపించింది. ఎన్టీఆర్‌ పోస్టర్‌కు పాలాభిషేకం చేస్తూ, సినిమాకు వచ్చిన వారిలో జోష్‌ నింపారు ఫ్యాన్స్. ఎన్టీఆర్‌ సీఎం కావాలంటూ నినాదాలు చేశారు నందమూరి అభిమానులు.

  • 25 Mar 2022 08:28 AM (IST)

    RRR సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం

    RRR సినిమా టికెట్ల కోసం ఒంగోలులో వివాదం తెలత్తింది. మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు సమానంగా టికెట్లు ఇవ్వాలని థియేటర్‌ యాజమాన్యాం దగ్గరి పంచాయితీ పెట్టారు ఫ్యాన్స్‌. సినిమా టికెట్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు మెగా ఫ్యాన్స్‌.

  • 25 Mar 2022 08:16 AM (IST)

    రికార్డులన్నీ ఆర్ఆర్ఆర్ సినిమావే అంటున్న ఫ్యాన్స్..

    ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నినింటిని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా బాహుబలి 2 , కేజీఎఫ్ రికార్డులను ఈజీగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్.

  • 25 Mar 2022 08:10 AM (IST)

    చిత్రయూనిట్ కు విషెస్ తెలుపుతున్న సినిమా తారలు..

    సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ పై సినిమా తారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • 25 Mar 2022 08:03 AM (IST)

    పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా ఆర్ఆర్ఆర్

    సినిమా చూసిన ఫ్యాన్స్ లో జోష్ మరింత రెట్టింపయ్యింది. అంచనాలకు మించి రాజమౌళి సినిమా తెరకెక్కించారని, తారక్ , చరణ్ పోటీపడి నటించారని అంటున్నారు. ఇద్దరు హీరోలను చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు అని అంటున్నారు మెగా నందమూరి ఫ్యాన్.. సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అంటున్నారు ఫ్యాన్స్

  • 25 Mar 2022 07:55 AM (IST)

    జై ఎన్టీఆర్, జై రాంచరణ్ నినాదాలతో ఫ్యాన్స్ సందడి

    జై ఎన్టీఆర్, జై రాంచరణ్ అంటూ నినాదాలతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రికార్డ్ బద్దలు కొట్టే సినిమా అంటూ ఫాన్స్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. థియేటర్స్ దగ్గర బాణాసంచా తో డప్పుల మోతలతో పండగ వార్తవరణం నెలకొంది. హీరోలకి సమానంగా రాజమౌళి ఫాన్స్ కూడా సందడి చేస్తున్నారు. ఫాన్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ బౌన్సర్స్ తో సెక్యురిటి ఏర్పాటు చేశారు థియేటర్ యాజమాన్యం.

     

  • 25 Mar 2022 06:52 AM (IST)

    థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తు

    శ్రీకాకుళం జిల్లాలో 40 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. తెల్లవారి జాము నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్  సందడి చేస్తున్నారు. బెనిఫిట్ షో ప్రదర్శించడంతో పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు ఫ్యాన్స్. పలు థియేటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 25 Mar 2022 06:47 AM (IST)

    భ్రమరాంబ థియేటర్‌లో రామ్ చరణ్ , ఉపాసన

    భ్రమరాంబ థియేటర్ లో ముగిసిన RRR స్పెషల్ షో. షో కి 10 నిమిషాల ముందే రామ్ చరణ్ వెళ్లిపోగా.. సినిమా మొత్తం చూసి  వెళ్లిన ఉపాసన. ఫాన్స్ కేరింతలు తో దద్దరిల్లు తున్న థియేటర్.

    Ram Charan

  • 25 Mar 2022 06:45 AM (IST)

    విజయనగరం  జిల్లావ్యాప్తంగా థియోటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా

    విజయనగరం  జిల్లావ్యాప్తంగా థియోటర్స్ వద్ద ఆర్ఆర్ఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. భారీ కటౌట్లు, పూజలతో అభిమానుల నినాదాలతో థియేటర్స్ హోరెత్తిస్తున్నారు.  థియోటర్స్ వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్. పలుచోట్ల పోలీసుల బందోబస్తు. అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసుల అవస్థలు పడుతున్నారు.

  • 25 Mar 2022 06:43 AM (IST)

    భ్రమరాంబ థియేటర్ దగ్గర భారీగా గుమ్మికుడిన చెర్రీ, తారక్ ఫాన్స్

    మొదలైన ఆర్ఆర్ఆర్ మేనియా.. మధ్యరాత్రి నుంచే మొదలైన RRR మూవీ సందడి నెలకొంది. హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ దగ్గర భారీగా గుమ్మికుడిన చెర్రీ, తారక్ ఫాన్స్. హోరెత్తించే నినాదాలతో సందడిగా మరిన  భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లు. రికార్డ్ బద్దలు కొట్టే సినిమా అంటూ ఫాన్స్ నినాదాలు.

  • 25 Mar 2022 06:40 AM (IST)

    తెల్లవారుజామున నుంచే థియేటర్ల వద్ద క్యూ కట్టిన చరణ్ తారక్ ఫ్యాన్స్…

    తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా RRR మానియా.. రాజమండ్రి ,కాకినాడ ,రావులపాలెం రాజోలు..జగ్గన్నపేట థియేటర్ల వద్ద ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ హంగామా.. తెల్లవారుజామున రెండు గంటల నుంచే థియేటర్ల వద్ద క్యూ కట్టిన చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్…

  • 25 Mar 2022 06:39 AM (IST)

    టపాసులు పేల్చుతూ ఫ్యాన్స్ హంగామా

    హైదరాబాద్ లోని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. టపాసులు పేల్చుతూ జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్

    Rrr

  • 25 Mar 2022 06:34 AM (IST)

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మెగా నందమూరి అభిమానుల సందడి.

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎగబడుతున్న మెగా నందమూరి అభిమానులు. దాంతో కోలాహలంగా మారిన జిల్లాలో పలు థియేటర్స్. ఇక బెనిఫిట్ షో టికెట్స్ 1000 రూపాయలు, 1500 రూపాయల వరకు అమ్ముతున్నారు అభిమాన సంఘాలు.

  • 25 Mar 2022 06:32 AM (IST)

    పశ్చిమగోదావరి జిల్లా 160 అడుగుల ఆర్ఆర్ఆర్ భారీ ఫ్లెక్సీ

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ట్రిపులార్‌ మూవీ కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాయలం రోడ్డులో ఏర్పాటు చేసిన 160 అడుగుల భారీ ఫ్లెక్సీని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

  • 25 Mar 2022 06:31 AM (IST)

    డల్లాస్ లో ఉన్న తారక్ ఫ్యాన్స్ సందడి

    విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ మానియా కనిపిస్తుంది. డల్లాస్ లో ఉన్న తారక్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా సందడి చేశారు. ఎన్టీఆర్ కటౌట్ కు డాలర్స్ దండ వేసి కేక్ కట్ చేశారు.

  • 25 Mar 2022 06:26 AM (IST)

    ఏఎంబీ మాల్‌లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన తారక్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. హైదరాబాద్ లో ఏఎంబీ మాల్ లో ఫ్యామిలీతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు తారక్.

  • 25 Mar 2022 06:20 AM (IST)

    తూ. గో.జిల్లాలో ఆర్ఆర్ఆర్ సందడి..

    తూ. గో.జిల్లా వ్యాప్తంగా 300 లకు పైగా థియేటర్ లలో RRR మూవీ హాంగామా మొదలైంది..తెల్లవారు జాము 3 గంటల నుండి థియేటర్లకు క్యూ కట్టారు చరణ్ ఫాన్స్… ఎన్టీఆర్ ఫాన్స్, రాజమండ్రి సాయి కృష్ణా థియేటర్ లో తెర మీద బొమ్మ కోసం ఇగర్ గా ఎదురుచూస్తున్నారు ఫాన్స్ .ఇప్పటికె హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా

Follow us on