RRR Movie : మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌తో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ప్రకటించారు కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడిందని ప్రకటించారు.
ఓమిక్రేన్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి వాయిదా పడటంతో ప్రేక్షకులు, అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
Keeping the best interests of all the involved parties in mind, we are forced to postpone our film. Our sincere thanks to all the fans and audience for their unconditional love. #RRRPostponed #RRRMovie pic.twitter.com/JlYsgNwpUO
— RRR Movie (@RRRMovie) January 1, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :
Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..