Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాతర్వాత విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీతగోవిందం సినిమాతో మరోహిట్ అందుకున్నాడు ఈ క్రేజీ హీరో. ఇక ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లైగర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు పూనమ్ టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం అవుతున్నారు.
ఇదిలా ఉంటే విజయ్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ సినిమాలతో హిట్స్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అంతే కాదు ఈ సినిమా స్క్రిప్ట్ పాన్ ఇండియా స్థాయిలో లేదని దేవరకొండ రియలైజ్ అయి లైట్ తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా మరో సారి శివ నిర్వాణ , విజయ్ సినిమాకు సంబంధించిన న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. శివ నిర్వాణతో తప్పకుండా సినిమా చేస్తున్నానని విజయ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. `లైగర్` షూటింగ్ కి అమెరికా వెళ్లిన విజయ్ తిరిగి రాగానే శివ సినిమాపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. చుశాలి మరి ఏంజరుగుతుందో
మరిన్ని ఇక్కడ చదవండి :