
కొన్ని సినిమాలు కాస్త నెమ్మదిగా మొదలై.. ఆ తరవాత పరిగెడతాయి. ప్రేక్షకులని తమ ప్రపంచంలోకి లాగేస్తాయి. ఛాంపియన్ అలాంటి సినిమానే. ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ టాక్ తెచ్చుకుంది. కొంచెం స్లో అనిపించిన సందర్భాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద ఇది కంటెంట్‌తో, ఎమోషన్‌తో గెలిచిన సినిమా అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బైరాన్‌పల్లి సాయుధ పోరాటం నేపథ్యాన్ని, ఫుట్‌బాల్ ఆటగాడు మైఖేల్ సి విలియమ్స్ కథతో ముడిపెట్టి రూపొందించిన ఈ ఫిక్షనల్ స్టోరీ ఆసక్తికరంగా మొదలవుతుంది. పీరియాడిక్ వాతావరణాన్ని దర్శకుడు చాలా శ్రద్ధగా, నిజాయితీ తీర్చిదిద్దాడు. కథలో అవసరమైనంత డ్రామా, భావోద్వేగం సమతుల్యంగా కనిపిస్తాయి. మైఖేల్ (రోషన్) ఫుట్‌బాల్ ఛాంపియన్ ట్రాక్ కూడా కథలో కీలకంగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
అతను బైరాన్‌పల్లిలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించినా, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో కథ ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్ లోకి వెళ్తుంది . అక్కడి నుంచి సినిమా గ్రిప్ మరింత బలపడుతుంది. సెకండ్ హాఫ్లో తెలంగాణ సాయుధ పోరాటం, వారి లక్ష్యాన్ని చూపించిన తీరు నిజాయితీగా అనిపిస్తుంది. ప్రీ–ఇంటర్వెల్‌లో రోషన్ ఫుట్‌బాల్ ఆడే సన్నివేశం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. అది సినిమాకి హైలెట్. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే…బైరాన్‌పల్లి పోరాటంని చూపించిన తీరు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తుంది. గ్రాండ్ స్కేల్, ఎమోషనల్ ఇంటెన్సిటీ కలిసి క్లైమాక్స్‌ను సినిమాకి హార్ట్‌గా నిలబెట్టాయి. రోషన్ ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. మైఖేల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్, చరిత్ర, పోరాటం కలిసి ఛాంపియన్ ని ప్రేక్షకుల మనసులో నిలబెట్టాయి. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఛాంపియన్ గా నిలబడింది.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‌గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.