
రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీతోనే రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డైరెక్టర్ గానూ తన ట్యాలెంట్ చాటుకున్నాడు. కాగా కాంతార 2 సినిమాకు ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందనే వార్తలు అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నాయి. అయితే ఏదీ అధికారికంగా రాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం ‘హోంబాలే ఫిల్మ్స్’ నుంచి అధికారికంగా అందింది. నవంబర్ 27 మధ్యాహ్నం 12:25 గంటలకు ‘ కాంతారా 2 ‘ మూవీ మొదటి పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. కాంతారా సినిమాతో నటుడిగానూ, దర్శకుడిగానూ రిషబ్ శెట్టి విజయం సాధించారు. రెండు షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. ఇప్పుడిదే సూపర్ హిట్ చిత్రానికి రెండో భాగం రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించి హోంబలే ఫిల్మ్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది.
‘ప్రతి క్షణం దైవ స్పర్శను అనుభవిస్తూనే చరిత్రలోని మర్మమైన సత్యాన్ని అన్వేషించండి. మునుపెన్నడూ చూడని అద్భుతాన్ని చూసేందుకు వేచి చూడండి. ఇది కాంతి మాత్రమే కాదు, ఇదొక దర్శనం. కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ లుక్ నవంబర్ 27, మధ్యాహ్నం 12:25 గంటలకు విడుదల కానుంది’ అని హోంబలే ఫిల్మ్స్ తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా టైటిల్ కార్డ్‌లో ‘కాంతారా’ అని మాత్రమే ఉంది. ‘కాంతారా చాప్టర్ 1’ అనే హ్యాష్‌ట్యాగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిషబ్ శెట్టి కొత్త అవతార్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సోమవారం (నవంబర్ 27) వరకు ఆగాల్సిందే. ‘కాంతారా 2’ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. కాంతారా 2 సినిమా షూటింగ్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసి 2024 ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహలు చేస్తోంది.
ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ದೈವಿಕ ಸ್ಪರ್ಶವನ್ನು ಅನುಭವಿಸುವ ಜತೆ ಇತಿಹಾಸದ ನಿಗೂಢ ಸತ್ಯವನ್ನು ಅನ್ವೇಷಿಸಿ. ಹಿಂದೆಂದಿಗೂ ನೋಡದ ವಿಸ್ಮಯವನ್ನು ಕಣ್ತುಂಬಿಕೊಳ್ಳಲು ಕಾತುರರಾಗಿ. ಇದು ಬರಿ ಬೆಳಕಲ್ಲ, ದರ್ಶನ 🔥
Step into the sacred echoes of the past, where divinity weaves through every frame. Stay enchanted for a glimpse into… pic.twitter.com/jiuwyqQRaP
— Hombale Films (@hombalefilms) November 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.