Gautham Menon – Vikram Chiyaan: విక్రమ్ తీరుతో తలపట్టుకుంటున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్.
కనీసం ఇప్పుడైనా.. రిలీజ్ అవుతుందనుకున్న ధృవ నక్షత్రం మూవీ.. మళ్లీ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ అప్పుల పాలు అయ్యేలా కనిపిస్తోంది. ఆయన పడిన శ్రమ కూడా బూదిడలో పోసిన పన్నీరుగానే మారుతోంది. దానికితోడు... చియాన్ విక్రమ్ తీరు కూడా.. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్‌ను తల పట్టుకునేలా చేస్తోంది. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ 'ధృవ నక్షత్రం' ఛాప్టర్ వన్.
కనీసం ఇప్పుడైనా.. రిలీజ్ అవుతుందనుకున్న ధృవ నక్షత్రం మూవీ.. మళ్లీ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ అప్పుల పాలు అయ్యేలా కనిపిస్తోంది. ఆయన పడిన శ్రమ కూడా బూదిడలో పోసిన పన్నీరుగానే మారుతోంది. దానికితోడు… చియాన్ విక్రమ్ తీరు కూడా.. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్‌ను తల పట్టుకునేలా చేస్తోంది. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ ‘ధృవ నక్షత్రం’ ఛాప్టర్ వన్. ఎప్పుడో 2017లో షూటింగ్ మొదలైన ఈ సినిమా.. ఇప్పటి వరకు విడుదల కాకుండానే ఉంది. డైరెక్టర్స్, మేకర్స్ మధ్య ఇష్యూ రావడం అది కాస్తా ముదిరి పెద్ద వివాదంగా మారడంతో.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ క్రమంలో ఎట్టకేలకు నవంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుందనుకున్న ఈ ఫిల్మ్… కోర్టు జోక్యంతో మరో సారి వాయిదా పడింది. డైరెక్టర్ గౌతమ్ మీనన్‌ను చిక్కులో నెట్టింది. ఇక దానికి తోడు.. ఇప్పటి వరకు జరిగిన ఈ మూవీ ప్రమోషన్లో చియాన్ విక్రమ్ దూరంగా ఉండడం కూడా ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఓ పక్క గౌతమ్ మీనన్.. తన పాత సినిమాను.. కాస్త కొత్తగా.. ఆన్‌లైన్‌లో ప్రమోషన్ కల్పిస్తుంటే… చియాన్ మాత్రం.. తనకేం పట్టనట్టు.. అసలు ఆ సినిమా తనది కాదన్నట్టు బిహేవ్ చేస్తూ రావడం.. విమర్శలకు దారితీస్తోంది. దాంతో పాటే గౌతమ్ మీనన్‌కు ఇదే పెద్ద తలనొప్పిగా కూడా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

