AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజంగా ఆమె ఆకాశంలో ఒక తార.. వైరల్ అవుతున్న శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్..

అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురైన శ్రుతిహాసన్ కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ రాణిస్తుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

నిజంగా ఆమె ఆకాశంలో ఒక తార.. వైరల్ అవుతున్న శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్..
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2026 | 7:37 AM

Share

వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి.

తాజాగా చిత్ర బృందం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. పెదవుల పై ఉన్న సిగరెట్‌, దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు రఫ్‌, గ్రిట్టీ టచ్‌ను జోడిస్తోంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ఆమె ప్రజెన్స్ పవర్ ఫుల్ గా ఉండబోతోంది.

ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉండబోతుంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by hittucinma (@hittucinma)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..